ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్, ధోనీ లేకుండా షకిబ్​ ఐపీఎల్ జట్టు - Kane Williamson

ఐపీఎల్​లోని ఉత్తమ ఆటగాళ్లతో ఓ జట్టును తయారు చేశాడు బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్​. క్రికెట్​ కామెంటేటర్​ హర్షా భోగ్లేతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆ జాబితాను వెల్లడించాడు.

Shakib Al Hasan picks IPL XI featuring cricketers
షకిబ్​ ఐపీఎల్​ జట్టులో కోహ్లీకి స్థానం లేదు!
author img

By

Published : Jun 25, 2020, 4:58 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో తనకు ఉత్తమంగా అనిపించిన ఆటగాళ్లతో ఓ జట్టు​ను తయారుచేశాడు బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్​. ఈ జట్టులో భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీలకు స్థానాన్ని కల్పించలేదు. క్రికెట్​ కామెంటేటర్​ హర్షా భోగ్లేతో జరిగిన ఇంటర్వ్యూలో ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఈ లీగ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరపున ఆడాడు షకిబ్. ఇతడు ప్రస్తుతం రెండేళ్ల నిషేధంలో ఉన్నాడు.

సన్​రైజర్స్​ హైదరాబాద్ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​, నైట్​రైడర్స్​ బ్యాట్స్​మెన్​ రాబిన్​ ఉతప్పలను ఓపెనర్లుగా.. మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ను కెప్టెన్​గా ఎంపిక చేశాడు షకిబ్. మిడిలార్డర్​లో మనీష్​ పాండే, యూసఫ్​ పఠాన్​తో పాటు తన పేరును అందులో చేర్చాడు​. విండీస్ ఆల్​రౌండర్ ఆండ్రూ రసెల్​ను ఫినిషర్​గానూ, సునీల్​ నరైన్​ను స్పిన్నర్​గానూ ఎంచుకున్నాడు. భువనేశ్వర్​ కుమార్​, లక్ష్మీపతి బాలాజీ, ఉమేష్​ యాదవ్​లను బౌలర్లుగా తీసుకున్నాడు​.

షకిబ్​ అల్​ హసన్​ ఉత్తమ ఐపీఎల్​ ఎలెవన్​:

డేవిడ్​ వార్నర్​, రాబిన్​ ఉతప్ప, గౌతమ్ గంభీర్​ (కెప్టెన్​), మనీష్​ పాండే, షకిబ్​ అల్​ హసన్​, యూసఫ్​ పఠాన్​, ఆండ్రూ రసెల్​, సునీల్​ నరైన్​, భువనేశ్వర్ కుమార్​, లక్ష్మీపతి బాలాజీ, ఉమేశ్​ యాదవ్​.

ఇదీ చూడండి... ఆ చట్టం వస్తే క్రికెట్​లో భారత్ 'గేమ్​ ఛేంజర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.