క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్లకు దొరికిపోయాడు. భారత్ స్టార్ పేసర్ బుమ్రాకు బౌలింగ్‌లో సలహాలిస్తూ ట్రోలింగ్‌కు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లోని సూపర్ ఓవర్లో బుమ్రా.. అత్యధిక పరుగులిచ్చిన తర్వాత సంజయ్ చేసిన ట్వీట్.. ఈ చర్చకు కారణమైంది.
-
Watched that super over from Bumrah. He is such a fabulous bowler but he could use the crease a little more to create different delivery angles. #INDvsNZ
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watched that super over from Bumrah. He is such a fabulous bowler but he could use the crease a little more to create different delivery angles. #INDvsNZ
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 30, 2020Watched that super over from Bumrah. He is such a fabulous bowler but he could use the crease a little more to create different delivery angles. #INDvsNZ
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 30, 2020
అసలేం జరిగింది?
బుధవారం జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 తొలుత టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో మొదట కివీస్ బ్యాటింగ్. బౌలింగ్ చేసిన బుమ్రా 17 పరుగులిచ్చాడు. అనంతరం రోహిత్ శర్మ బ్యాటింగ్ వల్ల టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత సంజయ్ మంజ్రేకర్.. "సూపర్ ఓవర్లో బుమ్రా బౌలింగ్ చూశాను. అతడో అద్భుతమైన బౌలర్. కాకపోతే క్రీజును ఉపయోగించి, ఇంకా వినూత్నంగా బౌలింగ్ చేయొచ్చు" అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు.. "చాలు ఇక ఆపు. సాధారణ ప్లేయర్ అయిన నువ్వు బుమ్రాకు సలహాలిస్తావా", "బుమ్రా స్థానంలో నువ్వుండుంటే 17 కాదు 34 పరుగిలిచ్చేవాడివి" అంటూ రీట్వీట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ధారాళంగా పరుగులిచ్చాడు. ఇతడి బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. భారత బౌలర్లందరిలో షమి మాత్రమే ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లోని చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇతడు.. విలియమ్సన్‌ను ఔట్ చేశాడు. పరుగులు చేయకుండా నియంత్రించాడు. లేదంటే టై అయిన ఈ మ్యాచ్ న్యూజిలాండ్ వశమయ్యేది.
భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20.. ఈరోజు(శుక్రవారం) వెల్లింగ్టన్లో జరగనుంది. ఇప్పటికే 3-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. జట్టులో మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.