తమ ఆటతో ఎన్నో మధురానుభూతులు మిగిల్చారు టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ తెందుల్కర్, యువరాజ్ సింగ్. వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా వీరు తమ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కలిసిన వీరు తమకిష్టమైన క్రికెట్‌ను కాకుండా గోల్ఫ్ ఆడారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ఆ ఫొటోలో యువీ గోల్ఫ్‌స్టిక్ పట్టుకొని నిలబడగా.. సచిన్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ‘క్రికెట్ నుంచి గోల్ఫ్ వరకు మా ప్రయాణం’ అని దానికి ఓ వ్యాఖ్యను జోడించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కాగా, 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో యువీ, సచిన్ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సచిన్ 85 పరుగులతో రెచ్చిపోగా.. యువరాజ్ బౌలింగ్‌లో మెరిశాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా భారత్ ప్రపంచకప్ గెలవడంలోనూ ముఖ్య భూమిక పోషించాడు. ఆ టోర్నీలో బ్యాట్‌తో పాటు బంతితో రాణించడం వల్ల 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా' ఎంపికయ్యాడు. ఇక శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించాక యువీ.. సచిన్‌ను హత్తుకొని భావోద్వేగానికి గురైన జ్ఞాపకాలు అభిమానులకు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సచిన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, యువరాజ్ మాత్రం 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో ఆటకు వీడ్కోలు పలికాడు.
ఇదీ చూడండి : 'సచిన్‌తో షేక్‌హ్యాండ్.. చేతిని ఒళ్లంతా రుద్దుకున్నా'