ETV Bharat / sports

సచిన్ మార్గదర్శకత్వం చాలా నేర్పింది: పృథ్వీషా

మాస్టర్ బ్లాస్టర్ సచిన్​ తనలో స్ఫూర్తిని నింపడం సహా కెరీర్​లో మార్గదర్శకుడిగా నిలిచారని అన్నాడు టీమ్​ఇండియా యువక్రికెటర్​ పృథ్వీ షా. ప్రాక్టీస్​లో ఆయన కలిసిన ప్రతిసారి బ్యాటింగ్​లో మెళకువల కంటే మానసిక అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారని తెలిపాడు.

Sachin speaks about mental aspects than technical ones: Prithvi Shaw
సచిన్​ నా మార్గదర్శకుడు: పృథ్వీషా
author img

By

Published : May 25, 2020, 1:20 PM IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్​ తెందూల్కర్ తనను కలిసినపుడు బ్యాటింగ్​లో​ మెళకువ​ల కంటే మానసిక అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారని టీమ్​ఇండియా యువ క్రికెటర్​ పృథ్వీషా అన్నాడు. ఓ ఇండియన్​ ఆయిల్​ ఉద్యోగితో​ జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

"నా ఎనిమిదేళ్ల వయసులో సచిన్​ను కలిశా. ఆ రోజు నుంచి ఆయన నా మార్గదర్శకుడిగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. మైదానంలో నిజ జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉంటారో తెలుసుకున్నా".

-పృథ్వీషా, టీమ్​ఇండియా యువక్రికెటర్

బిజీ లైఫ్​లోనూ సచిన్ తన ప్రాక్టీస్​ చూడటానికి సమయాన్ని వెచ్చించడం ప్రత్యేకంగా భావిస్తానని అన్నాడు పృథ్వీ షా. "సచిన్ నా ప్రాక్టీస్​ సమయంలో బ్యాటింగ్​ టెక్నిక్​ల కన్నా మానసిక అంశాలనే చర్చిస్తారు. సచిన్​తో పాటు అనేక కోచ్​ల మార్గదర్శకంలో నా కెరీర్​ ఉత్తమంగా సాగుతోంది" అని తెలిపాడు పృథ్వీ షా.

రాజ్​కోట్​ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​తో పృథ్వీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే మ్యాచ్​లో శతకంతో అలరించాడు. ఆస్ట్రేలియా సిరీస్​లో గాయంతో, ఆ తర్వాత డోపింగ్​ నిషేధం వల్ల కొంతకాలం జట్టుకు దూరమయ్యాడు.

ఇదీ చూడండి... 'మరి ఆ రోజుల్లో ఫోన్ మాట్లాడాలంటే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.