ఒకానొక దశలో బాగా పాపులర్ అయిన.. భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ రూపాన్ని పోలి ఉన్న వ్యక్తి బల్వీర్ చాంద్ గుర్తున్నాడా? ప్రస్తుతం ఇతడు మరోసారి తెరపైకి వచ్చాడు. తాజాగా ఈ లాక్‌డౌన్‌తో తన జీవనోపాధి కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా అతనితో పాటు తన కుటంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని బాధపడ్డాడు.
"లాక్డౌన్ కారణంగా నేను పని చేసే 'గోలి వడాపావ్ నెం.1' సంస్థకు ఆర్థిక నష్టం కలిగింది. దాంతో చాలా మంది సిబ్బందిని తొలిగించింది ఆ సంస్థ. అందులో నేను ఒకడిని. పరిస్థితులు మెరుగైన తర్వాత తిరిగి చేర్చుకుంటామన్నారు."
-బల్వీర్ చాంద్, సచిన్ పోలిన వ్యక్తి.
దీంతో పాటు తాను మొదటి సారి సచిన్‌ను కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు బల్వీర్.
"నా దగ్గర ఉన్న ఫొటోలపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని సచిన్‌ను కోరా. అతను సంతకాలు చేసుకుంటూ వెళ్లాడు. అప్పుడు 'అవి నా ఫొటోలు. నీవి కాదు' అని చెప్పగానే నా వైపు చూసి నవ్వాడు."
-బల్వీర్ చాంద్, సచిన్ పోలిన వ్యక్తి.
1999లో ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా బల్వీర్‌ను గావస్కర్ కామెంటరీ బాక్స్‌లోకి ఆహ్వానించడం వల్ల ఇతడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ఇది చూడండి : గుర్రాని దౌడు తీయిస్తూ.. ట్రాక్టర్ నడిపేస్తూ