ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్​ ఆడకపోవడం భారత్​కు లోటే!

ఆస్ట్రేలియాతో సిరీస్​లకు కోహ్లీ(టెస్టులకు), రోహిత్​ శర్మ(వన్డేలు, టీ20లకు) దూరమవ్వడం టీమ్​ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నాడు ఆసీస్​ క్రికెటర్​ స్మిత్​. వారి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారని తెలిపాడు.

Rohit
కోహ్లీ, రోహిత్​
author img

By

Published : Nov 24, 2020, 5:16 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు కెప్టెన్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సిరీస్​కు రోహిత్ ​శర్మ దూరమవ్వడం టీమ్​ఇండియాకు పూడ్చలేని లోటని ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్ అభిప్రాయపడ్డాడు​. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ప్రత్యర్థి జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు.

Virat
కోహ్లీ

"చాలా ఏళ్ల నుంచి పరిమిత ఓవర్ల సిరీస్​లో, టాప్​ఆర్డర్​లో రోహిత్ తానేంటో నిరూపించుకున్నాడు. కాబట్టి ఈసారి అతడు లేకపోవడం జట్టుకు లోటు. కానీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్​ఇండియాలో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్​లో మయాంక్​, కేఎల్​ రాహుల్​ టాప్​ ఆర్డర్​లో అద్భుతంగా ఆడారు. కాబట్టి హిట్​మ్యాన్​ లోటును తీర్చేందుకు చాలా మార్గాలు ఉన్నాయని భావిస్తున్నాను. కోహ్లీ గొప్ప ఆటగాడు. చాలాకాలం నుంచి అన్ని ఫార్మాట్లలో బాగా ఆకట్టుకుంటున్నాడు. టెస్టు​​లకు అతడు దూరమవ్వడం జట్టుపై ప్రభావం చూపుతుంది"

-స్మిత్​, ఆసీస్​ క్రికెటర్

బాల్​ ట్యాంపరింగ్​ కారణంగా 2018-19 భారత్​-ఆసీస్​ బోర్డర్​-గావస్కర్ సిరీస్​కు స్మిత్​ దూరమయ్యాడు. అయితే ఈసారి జరగబోయే సిరీస్​లో మాత్రం తాను అదరగొట్టాలని అనుకుంటున్నట్లు స్మిత్ చెప్పాడు. ఇరుజట్ల మధ్య ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అన్నాడు.

రోహిత్​ అనుమానమే

ఐపీఎల్​లో గాయపడ్డ రోహిత్​.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏ శిక్షణ శిబిరంలో ఉన్నాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫిట్​నెస్​ సాధిస్తేనే ఆసీస్​తో జరిగే టెస్టు సిరీస్​కు​ అర్హత సాధిస్తాడు. అతడు ఆసీస్​ పర్యటనకు వెళ్లనున్నాడా లేదా అనే విషయమై బీసీసీఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రోహిత్​ ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిత్​.. తాను టెస్టుల్లో ఆడి తీరుతానని ధీమా వ్యక్తం చేశాడు. నవంబరు 27న ప్రారంభమై జనవరి 19న ముగిసే ఈ సిరీస్​లో.. ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో తలపడనున్నాయి.

Rohit
రోహిత్​

ఇదీ చూడండి :

ఆసీస్​తో టెస్టు సిరీస్​కు రోహిత్​, ఇషాంత్​ కష్టమే!

రోహిత్ లేడు.. మరి ఓపెనింగ్ స్థానం ఎవరిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.