రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే మూడు డబుల్ సెంచరీలు, మైదానం నలువైపులా హోరెత్తే బౌండరీలే గుర్తొస్తాయి. ప్రత్యర్థి ఎవరైనా తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే రోహిత్‌ను అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఈ ఆటగాడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీనికనుగుణంగానే రోహిత్‌ను ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్నకు నామినేట్ చేసింది బీసీసీఐ. తాజాగా దీనిపై స్పందించాడు హిట్‌మ్యాన్. బీసీసీఐ ఈ వీడియోను షేర్ చేసింది.
-
"I am extremely honored and humbled"- @ImRo45 on being nominated for the prestigious Rajiv Gandhi Khel Ratna Award 2020 🗣️🙌 #TeamIndia pic.twitter.com/GmHqpEvwkF
— BCCI (@BCCI) May 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">"I am extremely honored and humbled"- @ImRo45 on being nominated for the prestigious Rajiv Gandhi Khel Ratna Award 2020 🗣️🙌 #TeamIndia pic.twitter.com/GmHqpEvwkF
— BCCI (@BCCI) May 31, 2020"I am extremely honored and humbled"- @ImRo45 on being nominated for the prestigious Rajiv Gandhi Khel Ratna Award 2020 🗣️🙌 #TeamIndia pic.twitter.com/GmHqpEvwkF
— BCCI (@BCCI) May 31, 2020
"ఖేల్‌రత్నకు నామినేట్ అవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇది దేశంలో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం. ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, సహ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, అభిమానులు, కుటుంబానికి రుణపడి ఉంటా."
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో రికార్డు సృష్టించాడు. భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2019 ఏడాదికి గానూ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గానూ నిలిచాడు. అలాగే టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్ ఘనత సాధించాడు. టెస్టు అరంగేట్రంలోనే రెండు సెంచరీలు చేసిన ఓపెనర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.