మైదానంలో ప్రశాంతంగా ఉండే రోహిత్‌శర్మ.. రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో కాస్త భావోద్వేగంగా కనిపించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపోద్రిక్తుడయ్యాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన హిట్‌మ్యాన్ ఈ విషయంపై స్పందించాడు. ఇకపై కెమెరా ఎక్కడుందో చూసుకుంటానని చెప్పి నవ్వులు పూయించాడు.
" మైదానంలో నేను చాలా భావోద్వేగంతో ఉంటాను. గత మ్యాచ్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు మైదానంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అలా జరిగింది. అయితే ఫీల్డింగ్‌లో మా జట్టు కాస్త అలసత్వం ప్రదర్శించింది. ఏది ఏమైనా చివరికి మ్యాచ్ గెలవాలనే అనుకుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాం".
- రోహిత్ శర్మ
ఏం జరిగిందంటే..
బంగ్లా బ్యాటింగ్ చేస్తుండగా చాహల్ 13వ ఓవర్ బౌలింగ్ చేశాడు. సౌమ్య సర్కార్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి ఓ బంతిని అడ్డుకోబోయాడు. కానీ బంతి టర్న్ తిరగడం వల్ల మిస్సయి కీపర్ రిషభ్ పంత్ చేతిలో పడింది. వెంటనే అతడు స్టంపౌట్ చేశాడు. ఈ విషయంపై ఫీల్డ్ అంపైర్ అనుమానం వ్యక్తం చేస్తూ థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేయగా ఫలితం నాటౌట్ అని వచ్చింది. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన రోహిత్ థర్డ్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
-
Rohit 😂😂 pic.twitter.com/CDKGcJESzJ
— Ghatta (@Kattehaiklu) November 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rohit 😂😂 pic.twitter.com/CDKGcJESzJ
— Ghatta (@Kattehaiklu) November 7, 2019Rohit 😂😂 pic.twitter.com/CDKGcJESzJ
— Ghatta (@Kattehaiklu) November 7, 2019
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు రోహిత్. 17 ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు బాదాడు. ధోనీ 62 ఇన్నింగ్స్‌ల్లో 34 సిక్సర్లు, విరాట్ 26 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. టీ20ల్లో అత్యధిక సిక్సుల (115) రికార్డు రోహిత్ పేరిటే ఉంది.
గురువారం(నవంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రోహిత్‌శర్మ(85), శిఖర్ ధావన్(31; 27 బంతుల్లో 4సిక్సర్లు) ధాటిగా ఆడడం వల్ల భారత్ 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఇరుజట్ల మధ్య ఆఖరి మ్యాచ్ నాగపూర్ వేదికగా ఆదివారం జరగనుంది.