ETV Bharat / sports

'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్ - రోహిత్ శర్మ తాజా వార్తలు

టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సామాజిక మాధ్యమాల బయో నుంచి 'ఇండియన్ క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు తలెత్తున్నాయి.

Rohit sharma Removed 'Indian cricketer' from his bio,
'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలగించిన రోహిత్
author img

By

Published : Oct 27, 2020, 5:34 PM IST

టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తోన్న తీరుపై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన జట్టులో రోహిత్​కు స్థానం దక్కకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు మ్యాచ్​లు గాయం కారణంగా దూరమైన మయాంక్ అగర్వాల్​ను మూడు ఫార్మాట్​లలోకి తీసుకున్న సెలక్షన్ కమిటీ.. రోహిత్​కు ఎందుకు స్థానం కల్పించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ తీసుకున్న ఓ నిర్ణయం ఫ్యాన్స్​ను మరింత అయోమయానికి గురి చేస్తోంది.

Rohit sharma Removed 'Indian cricketer' from his bio,
రోహిత్ ట్విట్టర్ బయో

సామాజిక మాధ్యమాల్లో రోహిత్​ అకౌంట్​ బయోలో 'ఇండియన్ క్రికెటర్'​ అని ఉండేది. కానీ ఈరోజు ఆ పదాన్ని తొలగించాడు హిట్​మ్యాన్. అందుకు గల కారణం స్పష్టంగా తెలియకపోయినా.. ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయనందుకే ఇలా చేశాడని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.