ETV Bharat / sports

రోహిత్ శర్మ.. ఒకే బౌలర్ చేతిలో ఆరోసారి

రోహిత్ శర్మను ఔట్ చేసిన లైయన్.. టెస్టుల్లో రికార్డు నెలకొల్పాడు. అత్యధికంగా అతడిని ఆరుసార్లు ఔట్ చేసిన తొలి బౌలర్​గా నిలిచాడు.

Rohit Sharma falls to Nathan Lyon yet again, the sixth time in Tests
రోహిత్ శర్మ.. ఒకే బౌలర్ చేతిలో ఆరోసారి
author img

By

Published : Jan 16, 2021, 2:00 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. ఈ ఫార్మాట్‌లో ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు ఔటయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని హిట్‌మ్యాన్‌.. మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టులో (26, 52) పరుగులు చేశాడు. గబ్బాలో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి లైయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అయితే, రోహిత్‌ ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా ఆరుసార్లు లైయన్‌ బౌలింగ్‌లోనే ఔట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడతో సమానంగా లైయన్‌ ఐదుసార్లు రోహిత్​ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో అతడిని టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు సాధించాడు.

మరోవైపు లైయన్‌ ఈ మ్యాచ్‌లో ఇంకో మూడు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా తరఫున 400 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అతడికన్నా ముందు షేన్‌వార్న్‌(708), మెక్‌గ్రాత్‌(563) ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.