ETV Bharat / sports

లెజెండ్స్​ క్రికెట్​ సిరీస్​కు​ షెడ్యూల్​ ఖరారు

కరోనా కారణంగా.. గతేడాది 4 మ్యాచ్​ల అనంతరం ఆగిపోయిన 'రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​' తిరిగి మొదలుకానుంది. భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​, వెస్టిండీస్ దిగ్గజం​ బ్రియాన్​ లారా మళ్లీ ఈ టోర్నీతో మైదానంలో సందడి చేయనున్నారు. మార్చి 5 నుంచి 21 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు షెడ్యూల్​ విడుదలయ్యింది.

Road Safety World Series: Indian legends to face Bangladesh in opener on March 5
లెజెండ్స్​ క్రికెట్​ సిరీస్​కు​ షెడ్యూల్​ ఖరారు
author img

By

Published : Feb 24, 2021, 12:15 PM IST

క్రికెట్​ లెజెండ్స్​ ఆడనున్న రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​కు షెడ్యూల్​ ఖరారైంది. మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న సిరీస్​ తొలి మ్యాచ్​లో ఇండియా లెజెండ్స్​, బంగ్లాదేశ్​ లెజెండ్స్​ టీమ్​లు తలపడనున్నాయి. అదే విధంగా మార్చి 7న ఇంగ్లాండ్​ లెజెండ్స్​, బంగ్లాదేశ్​ లెజెండ్స్​ జట్లు పోటీ పడనున్నాయి.

ఈ సిరీస్​లోని​ సెమీఫైనల్​ మ్యాచ్​లను మార్చి 17, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. మార్చి 21న తుదిపోరు జరగనుంది. గతేడాది జరిగిన ఈ టీ20 ఫార్మాట్​ సిరీస్​ తొలి ఎడిషన్​ కరోనా కారణంగా (మార్చి 11న) మధ్యలోనే ఆగిపోయింది.

టోర్నీకి వేదిక

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని 65వేల సీట్ల సామర్థ్యం ఉన్న షాహీద్​ వీర్​ నారాయణ్​​ సింగ్ అంతర్జాతీయ క్రికెట్​ స్డేడియం ఈ సిరీస్​కు వేదిక కానుంది. కేంద్రం విడుదల చేసిన కొవిడ్​ మార్గదర్శకాలను అనుసరిస్తూ.. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు.

లెజెండ్స్​ వీళ్లే..

ఈ సిరీస్​లో సచిన్​ తెందూల్కర్​, వీరేంద్ర సెహ్వాగ్​, బ్రియాన్​ లారాతో పాటు ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నె దిల్షాన్, బ్రెట్​ లీ సహా భారత్​, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్​, వెస్టిండీస్​ దేశాలకు చెందిన పలువురు దిగ్గజ ఆటగాళ్లు ​​ పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: మొతేరా స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.