క్రికెట్ లెజెండ్స్ ఆడనున్న 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' మార్చి 5 నుంచి ప్రారంభం కానుంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, బ్రియిన్ లారా మొదలైన దిగ్గజ ఆటగాళ్లు పాల్గొననున్నారు. కరోనా కారణంగా గతేడాది మధ్యలోనే వాయిదా పడిన ఈ టోర్నీ తిరిగి అక్కడ నుంచే మొదలుకానుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి ఈ టోర్నీ మార్చి 21 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్లు ఏమిటి? అందులో పాల్గొనే ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
ఇండియా లెజెండ్స్: సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, నియోల్ డెవిడ్, మునాఫ్ పటేల్, మన్‌ప్రీత్ గోనీ, నమన్ ఓజా, ప్రజ్ఞాన్ ఓజా, యూసఫ్ పఠాన్.
ఇంగ్లాండ్ లెజెండ్స్: కెవిన్ పీటర్సన్, ఓవైస్ షా, మాంటీ పనేసర్, నిక్ కాంప్టన్, క్రిస్ ట్రెమ్లెట్, కబీర్ అలీ, సాజిద్ మహ్మద్, ఫిల్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, జేమ్స్ ట్రెడ్‌వెల్, జోనాథన్ ట్రాట్, ర్యాన్ సైడ్‌బాటమ్, ఉస్మాన్ అఫ్జల్, మాథ్యూ హోగ్గార్డ్, జేమ్స్ టిండాల్.
వెస్టిండీస్ లెజెండ్స్: బ్రియాన్ లారా, పెడ్రో కొలిన్స్, నర్సింగ్ డియోనరైన్, టినో బెస్ట్, రిడ్లీ జాకోబ్స్, సులేమాన్ బెన్, దినానాథ్ రామ్‌నరైన్, ఆడమ్ సాన్ఫోర్డ్, విలియమ్ పెర్కిన్స్, కార్ల్ హూపర్, డ్వేన్ స్మిత్, ర్యాన్ ఆస్టిన్, మహేంద్ర నగమూటూ.
శ్రీలంక లెజెండ్స్: జయసూర్య, తరంగ, దిల్షాన్, కులశేఖర, చమర సిల్వ, చింతక జయసింగే, థిలాన్ తుషార, దమ్మిక ప్రసాద్, హెరాత్, కపుగెదెర, దులంజన విజేసింగే, రస్సెల్ అర్నాల్డ్, అజంతా మెండిస్, మహరూఫ్ మంజుల ప్రసాద్, మలింద వర్నపుర.
దక్షిణాఫ్రికా లెజెండ్స్: జాంటీ రోడ్స్, మఖయా ఎన్తిని, నిక్కీ బోజె, మోర్నె వాన్ విక్, గార్నెట్ క్రూగెర్, రోగెర్ టెలెమాకుస్, జస్టిన్ కెంప్, అల్విరో పీటర్సన్, ఆండ్రూ పటిక్, తండి షబలాల, లూట్స్ బోస్మన్, లియాడ్ నోరిస్ జోన్స్, జండెర్ డి బ్రూయిన్, మోండే జొండేకి.
బంగ్లాదేశ్ లెజెండ్స్: అబ్దుర్ రజాక్, ఖలీద్ మహ్మద్, నఫీస్ ఇక్బాల్, మహ్మద్ రఫీఖ్, ఖలీద్ మసూద్, హన్నన్ సార్కెర్, జావెద్ ఒమర్, రజిన్ సాలె, మెహ్రబ్ హుస్సేన్, అఫ్తబ్ అహ్మద్, అలాంగిర్ కబీర్, మహ్మద్ షరీఫ్, ముష్ఫికర్ రెహ్మాన్, మమూన్ ఉర్ రషీద్.
ఎక్కడ జరగనుంది?
గతేడాది నాలుగు మ్యాచ్‌లు మహారాష్ట్రలో జరిగాయి. కానీ ప్రస్తుతం జరగబోయే మ్యాచ్‌లకు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లోని 65వేల సీట్ల సామర్థ్యం ఉన్న షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. సిరీస్ తొలి మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ టీమ్‌లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరూ ఫిబ్రవరి 22 నుంచే బయోబబుల్‌లో ఉన్నారు.
రోడ్‌సేఫ్టీ సిరీస్ ఎందుకోసం?
భారత్‌లో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కోసం ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌కు బీసీసీఐ అనుమతి ఉంది. ఈ టోర్నీకి రవాణా శాఖ, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా పర్మిషన్ ఇచ్చింది.
షెడ్యూల్..
మార్చి 5: ఇండియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 6: శ్రీలంక లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 7: ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 8: దక్షిణాఫ్రికా లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 9: ఇండియా లెజెండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 10: బంగ్లాదేశ్ లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 11: ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 12: బంగ్లాదేశ్ లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 13: ఇండియా లెజెండ్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 14: శ్రీలంక లెజెండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 15: దక్షిణాఫ్రికా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 16: ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 17: సెమీ-ఫైనల్ 1 (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 19: సెమీ-ఫైనల్ 2 (రాత్రి 7గంటలకు ప్రారంభం)
మార్చి 21: ఫైనల్ (రాత్రి 7గంటలకు ప్రారంభం)