ETV Bharat / sports

'పంత్​ ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభిస్తే..!'

మేనేజ్​మెంట్​ నుంచి రిషభ్ పంత్​కు మద్దతు ఉందని టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్​ విక్రమ్​ రాథోడ్ తెలిపాడు. పరుగులు చేయడం మొదలు పెడితే.. పంత్​ను ఎవరూ ఆపలేరని అన్నాడు. ఆటలో ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ.. అవన్నీ తనని బలమైన, గొప్ప ఆటగాడిగా మారుస్తాయని అభిప్రాయపడ్డాడు.

Rishabh Pant can bring a lot to Indian cricket team once he starts scoring: Batting coach Vikram Rathour
రిషభ్​ పంత్​
author img

By

Published : Jun 27, 2020, 8:59 PM IST

భారత వికెట్​ కీపర్ రిషభ్​ పంత్​కు 2019 ఏడాది పెద్దగా కలిసిరాలేదు. అనుభవజ్ఞుల మద్దతు ఉన్నప్పటికీ.. గతేడాది భారత ప్రపంచకప్​ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే ధోనీ జట్టుకు దూరమైన కారణంగా​.. రిషభ్​​కు సత్తా నిరూపించుకునే సువర్ణవకాశం లభించింది. అయితే ​కీపర్​గా ధోనీ స్థానంలో వచ్చిన పంత్​.. 2020 ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత కేఎల్​ రాహుల్​ ఆ స్థానంలో మంచి గుర్తింపు తెచ్చుకోగా.. పంత్​కు ప్రాధాన్యం తగ్గిపోయింది.

అయితే, పంత్​కు ఇంకా మేనేజ్​మెంట్​ మద్దతు ఉందని టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్​ విక్రమ్​ రాథోడ్​ తెలిపాడు. పరుగులు సాధించడంలో పంత్​ జట్టుకు ఎంతగానో కృషి చేస్తాడని వెల్లడించాడు. ధోనీ స్థానంలోని ఒత్తిడిని అర్థం చేసుకున్న అతడు బలమైన, మంచి ఆటగాడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాథోడ్ .. తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

"పంత్ గతేడాది అంత గొప్ప ప్రదర్శన చేయలేదు. అతడికి ఇప్పటికీ టీమ్ మేనేజ్​మెంట్​ మద్దతు ఉంది. పంత్ ఓ ప్రత్యేకమైన ఆటగాడని నమ్ముతున్నాం. ఒక్కసారి అతడు పరుగులు చేయడం మొదలుపెడితే.. జట్టుకోసం ఎంతో కృషి చేస్తాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. పంత్​ కొన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. కాబట్టి కొంత ఒత్తిడికి లోనవుతున్నాడు. అయితే, ఇలాంటివన్నీ తనని బలమైన, మంచి ఆటగాడిగా మారుస్తాయి."

-విక్రమ్​ రాథోడ్​, టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్​

గతేడాది బంగ్లాదేశ్​ సిరీస్​లో పంత్​కు రెండు అవకాశాలు లభించాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో పంత్​కు గాయం కావడం వల్ల.. రాహుల్​ ఆ స్థానంలోకి వచ్చాడు. ఓ వైపు బ్యాట్స్​మన్​గా రాణిస్తూనే.. వికెట్​ కీపర్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు​. అలా కెప్టెన్​తో పాటు మేనేజ్​మెంట్​ నమ్మకాన్ని గెలుచుకున్న రాహుల్​.. పంత్​ను ప్రత్యామ్నాయ ఆటగాడిగా మార్చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.