భారత మహిళా క్రికెట్ గత మూడేళ్లలో అసాధారణమైన ప్రదర్శన కనబరుస్తోందని భారత మాజీ బ్యాట్స్‌మన్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. 2017లో జరిగిన 50 ఓవర్ల మహిళల ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ 171 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకునే కైఫ్ పై వ్యాఖ్యలు చేశాడు.
మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ సెమీపైనల్ మ్యాచ్‌లో కౌర్ కేవలం 115 బంతుల్లో 171 పరుగులు సాధించి.. జట్టు ఫైనల్‌కు చేరుకునేలా మార్గనిర్దేశం చేసింది.
-
Three years back, on this day, Harmanpreet Kaur hit 171*(115) v Australia in World Cup semi-final. Quality innings under pressure. The rise of Indian women’s cricket in the past three years has been phenomenal @ImHarmanpreet pic.twitter.com/6fy8IqvLNX
— Mohammad Kaif (@MohammadKaif) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Three years back, on this day, Harmanpreet Kaur hit 171*(115) v Australia in World Cup semi-final. Quality innings under pressure. The rise of Indian women’s cricket in the past three years has been phenomenal @ImHarmanpreet pic.twitter.com/6fy8IqvLNX
— Mohammad Kaif (@MohammadKaif) July 20, 2020Three years back, on this day, Harmanpreet Kaur hit 171*(115) v Australia in World Cup semi-final. Quality innings under pressure. The rise of Indian women’s cricket in the past three years has been phenomenal @ImHarmanpreet pic.twitter.com/6fy8IqvLNX
— Mohammad Kaif (@MohammadKaif) July 20, 2020
ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 20 ఫోర్లు, ఏడు సిక్సర్లతో విరుచుపడింది. దీంతో భారత్ 281 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా జట్టును 245 పరుగులకే కట్టడి చేసి టీమ్ఇండియా మహిళా జట్టు ఫైనల్‌కు చేరుకుంది . అయితే లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో మిథాలీ రాజ్ సారథ్యంలోని జట్టు ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై ఓటమి చవిచూసింది.