వెస్డిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరగబోయే తొలి టెస్టుకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రిచర్డ్‌ను తటస్థ అంపైర్‌గా నియమించింది ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలీట్ ప్యానెల్లో బంగ్లాదేశ్ తరఫున అంపైర్ లేనందువల్లనే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లాక్డౌన్ తర్వాత తొలి తటస్థ అంపైర్‌గా రిచార్డ్ నిలవనున్నాడు.
కరోనా నేపథ్యంలో గతేడాది జూన్‌లో తాత్కాలిక నిబంధనలను అమలులోకి తెచ్చింది ఐసీసీ. అందులో భాగంగానే తటస్థ అంపైర్ల నియామకాన్ని రద్దు చేసింది.
వెస్డిండీస్-బంగ్లాదేశ్ రెండు మ్యాచులతో కూడిన టెస్టు సిరీస్ ఆడనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు జాహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు రెండో టెస్టు జరుగుతుంది. ఇప్పటికే విండీస్‌పై 3-0 తేడాతో బంగ్లా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: రిషభ్ పంత్ కాదు.. 'స్పైడర్ పంత్'- ఐసీసీ ప్రశంస