ETV Bharat / sports

సర్జరీ తర్వాత ప్రాక్టీస్​ మొదలుపెట్టిన జడేజా - india vs australia

బొటనవేలి గాయం నుంచి కోలుకున్న టీమ్ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. వేలికి సర్జరీ తర్వాత శిక్షణను తిరిగి ప్రారంభించినట్లు ట్విట్టర్​లో వీడియోలను పంచుకున్నాడు.

Ravindra Jadeja hits ground for first time post thumb injury
సర్జరీ తర్వాత ప్రాక్టీస్​ మొదలుపెట్టిన జడేజా
author img

By

Published : Mar 3, 2021, 7:40 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో బొటనవేలికి గాయమైన కారణంగా విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా.. తిరిగి ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. మైదానంలో రన్నింగ్​, జిమ్​లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు. "సర్జరీ తర్వాత మైదానంలో తొలిరోజు", జిమ్​లో కసరత్తులు చేస్తోన్న వీడియోలను పోస్ట్​ చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో జడేజా బొటనవేలికి గాయమైంది. ఆ తర్వాత అది సర్జరీ దారి తీసింది. దీంతో జడ్డూకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​కు జడేజా పూర్తిగా దూరమయ్యాడు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు జడ్డూ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.