ETV Bharat / sports

రవిశాస్త్రి క్రికెట్​ ప్రయాణానికి 40 ఏళ్లు

టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి.. క్రికెట్​లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 40 ఏళ్లు పూర్తయ్యాయి. భారత్​ తరఫున 1981లో న్యూజిలాండ్​తో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడిన శాస్త్రి.. నేటికీ టీమ్​తో కొనసాగుతుండటం విశేషం. ఈ సందర్భంగా తన మొదటి టెస్టుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

ravi shastri shares his debut team india pic 40 years ago on this day
రవిశాస్త్రి క్రికెట్​ ప్రయాణానికి 40 ఏళ్లు
author img

By

Published : Feb 21, 2021, 3:29 PM IST

టీమ్‌ఇండియా హెడ్ ‌కోచ్‌ రవిశాస్త్రి భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ట్విట్టర్‌లో తన అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం నాటి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 1981 ఫిబ్రవరి 21న న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడినట్లు చెప్పాడు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ఈ ఆటతో, టీమ్‌ఇండియాతో ప్రయాణించడం గొప్పగా ఉందని శాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు.

మరోవైపు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌గా రవిశాస్త్రి 11 ఏళ్లు సేవలందించాడు. అందులో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో 3,830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో 3,108 పరుగులు, 129 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతడు తొలి అంతర్జాతీయ పర్యటనలోనే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆపై కపిల్‌ నేతృత్వంలోని 1983 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.

  • On this day 40 years ago...in Wellington I made my Test debut. It’s great to be still part of the great game and be involved with the national team 🙏🏻🇮🇳 pic.twitter.com/qVoExInyG3

    — Ravi Shastri (@RaviShastriOfc) February 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక 1985-86 సీజన్‌లో ముంబయి తరఫున బరోడా జట్టుతో ఆడిన ఓ రంజీ మ్యాచ్‌లో రవిశాస్త్రి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ గ్యారీ సోబర్స్‌ సరసన నిలిచాడు. అదే మ్యాచ్‌లో శాస్త్రి(200*; 123 బంతుల్లో 13x4, 13x6) తక్కువ బంతుల్లో ద్విశతకం బాదిన ఫస్ట్‌క్లాస్‌ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు.

ఇక 1992లో రిటైరైన రవిశాస్త్రి, తర్వాత వ్యాఖ్యాతగా, భారత జట్టు మేనేజర్‌గా పలు విభాగాల్లో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే 2017లో అనిల్‌కుంబ్లే కోచ్‌గా తప్పుకున్నాక రవిశాస్త్రి ఆ బాధ్యతల్లో చేరాడు. అతడి పర్యవేక్షణలోనే టీమ్‌ఇండియా వరుసగా రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియాలో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లు గెలుపొందడం విశేషం.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్ రొటేషన్​ పద్ధతికి స్టెయిన్ కితాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.