ETV Bharat / sports

రహానె.. కెప్టెన్సీ కోసమే పుట్టాడు: చాపెల్ - క్రికెట్​ ఆస్ట్రేలియా వార్తలు

టీమ్​ఇండియా కెప్టెన్​ అజింక్యా రహానెపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​ ప్రశంసలు కురిపించారు. రహానె ఓ సాహసవంతుడని కితాబిచ్చారు. నాయకత్వం వహించడానికే రహానె పుట్టాడని తెలిపారు.

Rahane is brave, smart and born to lead cricket teams: Ian Chappell
'రహానె తెలివైన కెప్టెన్​.. నాయత్వం వహించడానికే పుట్టాడు'
author img

By

Published : Jan 3, 2021, 3:26 PM IST

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో జట్టుకు కెప్టెన్సీ చేసిన అజింక్యా రహానెపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించారు. రహానె.. సాహసవంతుడని, తెలివైనవాడని, జట్టుకు నాయకత్వం వహించడానికే పుట్టాడని కొనియాడారు.

"మెల్​బోర్న్​ టెస్టులో కెప్టెన్​గా టీమ్​ఇండియాను రహానె అద్భుతంగా నడిపించాడు. 2017లో ఆసీస్​తో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్​ చూసిన ఎవరైనా.. రహానె నాయకత్వం వహించడానికే పుట్టాడని అర్థం చేసుకుంటారు. అప్పటి మ్యాచ్​కు, మెల్​బోర్న్​ టెస్టు​కు పోలికలున్నాయి. అప్పుడు కూడా చేయాల్సింది తక్కువ పరుగులే అయినా లోయర్ ఆర్డర్​లో రవీంద్ర జడేజా నుంచి అద్భుత సహకారంతో రహానె మ్యాచ్​ను పూర్తిచేశాడు. నాడు వార్నర్​-స్మిత్​లు సెంచరీ భాగస్వామ్యంలో ఉండగా అరంగేట్రంలో ఉన్న కుల్​దీప్​ యాదవ్​కు బంతి ఇచ్చాడు రహానె. ఆ సంచలన నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. అతడు కేవలం ధైర్యవంతుడు, తెలివైనవాడే కాదు.. పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నా ప్రశాంతంగా ఉండగలడు. అవసరమైన సమయంలో పరుగులు చేసి సహచరుల నుంచి అమితమైన గౌరవం సంపాందించాడు రహానె. మంచి సారథి లక్షణం అదే."

-ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

అడిలైడ్​ టెస్టులో 36పరుగులతో కెరీర్​లోనే చెత్త రికార్డు నమోదు చేసింది టీమ్​ఇండియా. మెల్​బోర్న్​లో రెండో మ్యాచ్​లో సారథి విరాట్​ కోహ్లీ, రోహిత్, పేసర్లు షమీ, ఇషాంత్ శర్మ వంటి స్టార్​ ఆటగాళ్లు లేకున్నా.. అద్భుతమైన వ్యూహాలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు రహానె.

జస్​ప్రీత్​​ బుమ్రా, రవిచంద్రన్​ అశ్విన్​లను కూడా చాపెల్ ప్రశంసించారు. ఎప్పటిలాగే బుమ్రా తన టెక్నిక్​తో బ్యాట్స్​మెన్​ను బోల్తాకొట్టించాడని తెలిపారు. అశ్విన్ మరోసారి స్మిత్​పై​ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడని చాపెల్​ అన్నారు. సీనియర్ల స్ఫూర్తితో అరంగేట్రంలోనే శుభమన్​ గిల్​, మహ్మద్​ సిరాజ్​ అదరగొట్టారని చెప్పారు.

ఇదీ చూడండి: మెల్​బోర్న్​లో వర్షం.. ఆగిన టీమ్​ఇండియా ప్రాక్టీస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.