ప్రస్తుతం భారతదేశమంతా లాక్డౌన్లో ఉంది. రానున్న 21 రోజుల పాటు ఎవరూ బయటకు రాకుడదని, ప్రధాని మోదీ చేసిన సూచనల మేరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా ఈ వైరస్ అరికట్టటంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ క్రేజీ ట్వీట్ చేశాడు. గతేడాది ఐపీఎల్లో తను మన్కడింగ్ చేసిన ఫొటోను పోస్ట్ చేసి, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు.
-
Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.
Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt
">Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020
As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.
Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFtHahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020
As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.
Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt
"హహహ, ఇది నాకో ఎవరో పంపించారు. ఈ రనౌట్ జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. దేశం లాక్డౌన్ ఉన్న సమయంలో పౌరులకు ఇది సరైన సూచన. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి" -రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్
గత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, ప్రత్యర్థి ఆటగాడు బట్లర్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది సరైన పద్ధతే అయినప్పటికీ.. కొందరు మాత్రం విమర్శలు చేశారు.