మైదానంలో బ్యాట్, బంతితోనే కాకుండా విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకెళ్లడం, ఆటగాళ్లతో సెల్ఫీలు,ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతూ విచిత్రమైన పనులు చేస్తుంటారు. తాజాగా ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్, శ్రీలంక మధ్య జరిగిన టీ20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది.
కానెబెర్రా వేదికగా మనుకా ఓవల్‌లో మ్యాచ్ జరుగుతుండగా.. విరామ సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు అందించారు. శ్రీలంక 16వ ఓవర్ ఆడుతోంది. అప్పటికే 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆ సమయంలో పసుపు రంగు టోపీ, ఫార్మల్ దుస్తుల్లో వెళ్లిన మారిసన్.. క్రిస్ లిన్, జాసన్ సంగాలకు వాటర్ బాటిళ్లు, డ్రింక్‌లు అందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లకు 131 పరుగులకే పరిమితమయ్యారు లంకేయులు. ఫెర్నాండో 38 రన్స్‌తో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టు 19.5 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.