ఐపీఎల్ కొత్త సీజన్ కోసం సన్నద్ధమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నిరాశపరిచే వార్త ఇది. ఆ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైన 48 ఏళ్ల బౌలర్ ప్రవీణ్ తాంబేపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేటు వేసింది. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రవీణ్.. రిటైర్మెంట్ తీసుకుని విరమించుకున్నాడని, ఆ తర్వాత ముంబయి లీగ్‌లో ఆడాడని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. అనంతరం ఎవరికీ చెప్పకుండా దుబాయ్‌లో టీ20 లీగ్ ఆడాడని పేర్కొన్నారు. అందుకే ఈ వేటు వేసినట్లు స్పష్టం చేశారు.
గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ పెద్దోడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. అంతకు ముందు 2013-16 మధ్య రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 33 మ్యాచ్‌లు ఆడాడు. 28 వికెట్లు తీశాడు. అతడిని వేటు వేసిన కారణంగా మరి ఇప్పుడు కేకేఆర్ ఎవరిని తీసుకుంటుందో చూడాలి.