ETV Bharat / sports

'ఫిట్​నెస్​ ప్రోటోకాల్స్​'ను ప్రారంభించిన మోదీ - ప్రధాని మోదీ

ఫిట్​నెస్​ ఔత్సాహికులు, క్రీడాకారులతో నిర్వహించిన ఫిట్​ ఇండియా వర్చువల్​ కార్యక్రమంలో భాగంగా 'వయసుకు తగిన ఫిట్​నెస్​ ప్రోటోకాల్స్​'ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో మూడు కేటగిరీలుగా ప్రోటోకాల్స్​ రూపొందించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు సభ్యులు.

PM Modi launches Age Appropriate Fitness Protocols
'ఫిట్​నెస్​ ప్రోటోకాల్స్​'ను ప్రారంభించిన మోదీ
author img

By

Published : Sep 24, 2020, 3:45 PM IST

'ఫిట్​ ఇండియా' ఉద్యమం తొలి వార్షికోత్సవం సందర్భంగా ఫిట్​నెస్​ ఔత్సాహికులు, క్రీడాకారులతో వర్చువల్​గా సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా 'వయసుకు తగిన ఫిట్​నెస్​ ప్రోటోకాల్స్​'ను ప్రారంభించారు. ఫిట్​నెస్​ ఔత్సాహికుల సూచనల మేరకు మూడు కేటగిరీలుగా ఈ ప్రోటోకాల్స్​ను రూపొందించారు. అందులో 5-18, 18-65, 65 సంవత్సరాలు ఆపై వయసు కేటగిరీలుగా విభజించారు.

వర్చువల్​ సమావేశంలో భాగంగా.. ఫిట్​నెస్​, పోషణ, సవాళ్లు, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు మోదీ. ఈ సందర్భంగా ఫిట్​నెస్​ విషయంలో తమ అనుభవాలను పంచుకున్నారు పలువురు సభ్యులు. ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం, దినచర్యలో విభిన్న విధానాలు, స్వల్ప మార్పులతో జీవితాన్ని ఆరోగ్యంగా మార్చుకునేందుకు వీలుకలుగుతుందని వివరించారు.

" ఆరోగ్యకరమైన మనసుకు ఆరోగ్యకరమైన శరీరం అవసరం. అందుకు శరీర దారుఢ్యమే ప్రధానం. రెండు భోజనాల మధ్య అంతరం ఉండాలి. తద్వారా మనం తినేదాన్ని ప్రాసెస్​ చేయడానికి శరీరం సిద్ధంగా ఉంటుంది. ఫిట్​నెస్​ ప్రయత్నాల్లో ఉత్తమ ఫలితాలు పొందేందుకు తమ ప్రాధాన్యతను నిర్ణయించటం చాలా ముఖ్యమైన విషయం. "

- విరాట్​ కోహ్లీ, భారత క్రికెట్​ జట్టు సారథి

ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు, భారత క్రికెట్​ జట్టు సారథి విరాట్​ కోహ్లీ, పారాఒలంపిక్స్​ బంగారు పతక​ విజేత, జావలిన్​ త్రో క్రీడాకారుడు దేవేంద్ర జాజారియా, మహిళా ఫుట్​బాల్​ క్రీడాకారిణి అఫ్షానా ఆశిక్​, ఫిట్​నెస్​ ప్రమోటర్​ మిలింద్​ సోమన్​, వ్యాయామ శాస్త్ర నిపుణుడు రుజుతా దివేకర్​, యోగా గురువు స్వామి శివదయానంద్​ సరస్వతి, జాతీయ ఆర్గనైజింగ్​ కార్యదర్శి ముకుల్​ కనిత్కర్​ పాల్కొన్నారు.

PM Modi launches Age Appropriate Fitness Protocols
కార్యక్రమంలో పాల్గొన్న ఫిట్​నెస్​ ఔత్సాహికులు, క్రీడాకారులు

దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని 2019, ఆగస్టు 29న ప్రారంభించారు ప్రధాని మోదీ. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 3.5 కోట్ల మందికిపైగా పాల్గొన్నారు. అంతకు ముందు ఆగస్టు 15న నిర్వహించిన ఫిట్​ ఇండియా ఫ్రీడమ్​ రన్​లో 2.5 కోట్ల మంది పాలుపంచుకున్నారు.

ఇదీ చూడండి: ఫిట్​ ఇండియా: కోహ్లితో ప్రధాని మోదీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.