ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న పాకిస్థాన్​ - ఇంగ్లాండ్​-పాకిస్థాన్​ రెండో టెస్టు

ఇంగ్లాండ్​-పాకిస్థాన్​ మధ్య రెండో టెస్టు నేడు ప్రారంభమైంది. సౌథాంప్టన్​ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పాక్​.. మొదట బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ టెస్టులో గెలిస్తే సిరీస్​ ఇంగ్లీష్​ జట్టు సొంతం కానుంది.

england vs pakistan, 2nd Test
టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న పాకిస్థాన్​
author img

By

Published : Aug 13, 2020, 4:35 PM IST

సిరీస్​ ఆరంభ టెస్టులో బోణీ కొట్టిన ఇంగ్లాండ్‌తో పోటీకి సిద్ధమైంది పాక్​. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచే సౌథాంప్టన్‌లో రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పాక్​ కెప్టెన్​ అజహర్​ అలీ.. మొదట బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. ఈ టెస్టులో పాక్​ కచ్చితంగా నెగ్గితేనే సిరీస్​ ఆశలు నిలబడనున్నాయి. ఇప్పటికే సిరీస్​లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్​ జట్టు.

ఈ టెస్టులో ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​కు చోటు దక్కలేదు. బ్యాటింగ్​ లైనప్​ను కూడా పెంచుకునేందుకు మార్క్​ వుడ్​ స్థానంలో సామ్​ కరన్​కు తుది జట్టులో స్థానం లభించింది. ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ స్థానంలో జాక్​ క్రావ్లేకు చోటిచ్చారు. కుటుంబ సమస్యల కారణంగా రెండు టెస్టులకు స్టోక్స్​ అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్​ యాజమాన్యం స్పష్టం చేసింది.

దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ టెస్టు జట్టు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాడు పాక్​ సీనియర్​ క్రికెటర్​ ఫవద్​ అలం.

ఇంగ్లాండ్​ జట్టు:

రోరీ బర్న్స్​, డోమ్​ సిబ్లే, జాక్​ క్రావ్లే, జో రూట్​(కెప్టెన్​), ఒలీ పోప్​, బట్లర్​, క్రిస్​ వోక్స్​, సామ్​ కరన్​, డామ్​ బెస్​, స్టువర్ట్​ బ్రాడ్​, జేమ్స్​ అండర్సన్​,

పాకిస్థాన్​ జట్టు:

షాన్​ మసూద్​, అబిద్​ అలీ, అజహర్​ అలీ(కెప్టెన్​), బాబర్​ అజామ్​, అసద్​ షఫిక్​, ఫవద్​ అలం, మహమ్మద్​ రిజ్వాన్​, యాసిర్​ షా, మహమ్మద్​ అబ్బాస్​ష షాహిన్​ అఫ్రిది, నసీం షా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.