ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో చివరి బంతికి పాక్‌ గెలుపు - పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాతో వెన్డే సిరీస్​లో పాకిస్థాన్​ శుభారంభం చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్​లో పాక్​ ఆఖరి బంతికి గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్​లో 1-0తో ముందంజలో ఉంది.

pakistan won the first odi
ఉత్కంఠ భరిత పోరులో పాక్‌ గెలుపు
author img

By

Published : Apr 3, 2021, 6:43 AM IST

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ (103; 104 బంతుల్లో 17×4) సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో మొదట సఫారీ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఒక దశలో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. వాండర్ ‌డసెన్‌ (123 నాటౌట్‌; 134 బంతుల్లో 10×4, 2×4).. మిల్లర్‌ (50; 56 బంతుల్లో 5×4)తో కలిసి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు.

చివరి బంతికి గెలుపు..

ఛేదనలో పాక్‌ 9/1తో ఆరంభంలో తడబడింది. కానీ ఇమాముల్‌ హక్‌ (70)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన బాబర్‌.. రెండో వికెట్‌కు 177 పరుగులు జత చేసి విజయానికి గట్టి పునాది వేశాడు. కానీ స్వల్ప తేడాతో బాబర్‌, హక్‌ ఔట్‌ అయ్యారు. దీంతో పాక్‌ 186/1 నుంచి 203/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో రిజ్వాన్‌ (40), షాదాబ్‌ ఖాన్‌ (33) నిలిచి పాక్‌ను విజయానికి చేరువ చేశారు. రిజ్వాన్‌ ఔటైనా షాదాబ్‌ ఆఖరి వరకు నిలిచాడు. దీంతో పాక్‌ విజయం సులభమే అనిపించింది. కానీ ఫెలుక్వాయో వేసిన ఆఖరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సిన స్థితిలో తొలి నాలుగు బంతులకు ఒక్క పరుగు రాకపోగా.. షాదాబ్‌ ఔటైపోయాడు. అయితే చివరి రెండు బంతులకు మూడు పరుగులు చేసిన ఫహీమ్‌ (5 నాటౌట్‌) జట్టును గెలిపించాడు. సఫారీ బౌలర్లలో నార్జ్‌ (4/51) రాణించాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్ టైమ్​లో సిరీస్​లా.. క్రికెట్ బోర్డులతో పీటర్సన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.