ETV Bharat / sports

రెండు బులెట్లు దిగిన వ్యక్తి ప్రపంచకప్​లో అంపైర్!​

author img

By

Published : Mar 10, 2020, 7:58 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్​ గెలిచి ఆస్ట్రేలియా ఐదోసారి ఛాంపియన్​ అవగా.. భారత్​ తొలిసారి రన్నరప్​గా చోటు దక్కించుకుంది. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్​లో అంపైరింగ్​ బాధ్యతలు చేపట్టిన అసన్​ ​రజా వెనుక ఓ కన్నీటి గాథ ఉంది.

Pakistan umpire ahsan raza did umpiring in women's t20 world cup final after survive from 2 bullets injury
రెండు బులెట్లు దిగిన వ్యక్తి ప్రపంచకప్​లో అంపైర్!​

" 2009 మార్చి 3.. లాహోర్​లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో అంపైర్​ అసన్​రజా​ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఊపిరితిత్తులు, కాలేయంలోకి రెండు బులెట్లు దిగాయి. ఫలితంగా కోమాలోకి వెళ్లిపోయాడు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నా కొన్ని నెలల పాటు నడవలేకపోయాడు. ఏడాది కాలం తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన అతడు.. అంపైరింగ్​పై దృష్టిపెట్టాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ అతడు మెల్​బోర్న్​ గ్రౌండ్​లో ప్రపంచకప్​ ఫైనల్లో అంపైర్​గా పనిచేశాడు" అంటూ క్రికెట్​ విశ్లేషకుడు రౌనక్​ కపూర్​.. అసన్​ రజా గురించి చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్​కు చెందిన మాజీ వికెట్​కీపర్​, బ్యాట్స్​మన్ అసన్ రజా..​​ అలనాటి దుర్ఘటనపై నోరు విప్పాడు. "నా గాయాలు మానినా ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇప్పటికీ ఆ దాడి గురించి ఎవరైనా ప్రస్తావిస్తే దయచేసి మాట్లాడొద్దని చెప్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.

సెమీఫైనల్లోనూ భారత్​-ఇంగ్లాండ్​ జట్టుకు అంపైర్​గా బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నా.. మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. అయితే మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో జరిగిన భారత్​-ఆస్ట్రేలియా ఫైనల్​కు మాత్రం రజా బాధ్యతలు నిర్వర్తించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.