శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు వేదికలను ప్రకటించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). రావల్పిండి, కరాచీ వేదికలుగా... డిసెంబరులో మ్యాచ్‌లు జరగనున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పాక్ మళ్లీ టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమిస్తోంది.
ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 11న తొలి టెస్టు, 19న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌లకు లంక వస్తే... జనవరిలో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుందని భావిస్తోంది.
ఉగ్రదాడి తర్వాత...
2009లో లాహోర్‌లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. అప్పట్నుంచి ఏ దేశం దాయాది గడ్డపై కాలు మోపలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత టీ20లు, వన్డేలు ఆడేందుకు ఆ దేశం వెళ్లింది లంక జట్టు. అయితే ఈ పర్యటనకు ముందు లంక సీనియర్ క్రికెటర్లు పాక్ వెళ్లేందుకు నిరాకరించడం సంచలనమైంది. ఎట్టకేలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది లంకబోర్డు. దాయాది దేశం వెళ్లి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
![Pakistan hosting first Test series in 10 years after discussions with the srilanka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4546602_match79.jpg)
బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో...
భద్రత పట్ల ఆందోళన ఉన్నప్పటికీ పాకిస్థాన్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు... ఆ దేశం అధ్యక్ష స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో హోటల్‌కు తరలించింది. వాహనాల్లో క్రీడాకారులను తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి.
-
Itna Kashmir kiya ke Karachi bhool gaye 👏👏😀 pic.twitter.com/TRqqe0s7qd
— Gautam Gambhir (@GautamGambhir) September 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Itna Kashmir kiya ke Karachi bhool gaye 👏👏😀 pic.twitter.com/TRqqe0s7qd
— Gautam Gambhir (@GautamGambhir) September 30, 2019Itna Kashmir kiya ke Karachi bhool gaye 👏👏😀 pic.twitter.com/TRqqe0s7qd
— Gautam Gambhir (@GautamGambhir) September 30, 2019
లైట్లు వెలగలేదు...
అక్టోబర్ 1న పాక్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డేను డే/నైట్ మ్యాచ్‌గా నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో కరాచీ స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లు పదేపదే ఆగిపోవడం వల్ల చాలాసార్లు అంతరాయం కలిగింది. దీనిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.
-
Power cut during #PAKvSL. As Pakistan failed, finally Srilanka team paid the bill.
— prayag sonar (@prayag_sonar) October 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
International live telecast of Economy failure. pic.twitter.com/bUoO2blp9x
">Power cut during #PAKvSL. As Pakistan failed, finally Srilanka team paid the bill.
— prayag sonar (@prayag_sonar) October 1, 2019
International live telecast of Economy failure. pic.twitter.com/bUoO2blp9xPower cut during #PAKvSL. As Pakistan failed, finally Srilanka team paid the bill.
— prayag sonar (@prayag_sonar) October 1, 2019
International live telecast of Economy failure. pic.twitter.com/bUoO2blp9x
వన్డే సిరీస్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిచినా.. టీ20 సిరీస్‌లో మాత్రం క్లీన్‌స్వీప్ అయింది. పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న పాక్ జట్టు... మూడు మ్యాచ్‌లూ ఓటమిపాలైంది.