ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన ర్యాంకు మెరుగుపరుచుకుంది పాకిస్థాన్. శుక్రవారం దక్షిణాఫ్రికాపై మ్యాచ్ గెలిచిన అనంతరం టేబుల్లో 5వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్ ఫలితం కారణంగా సఫారీ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది దక్షిణాఫ్రికా జట్టు. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో పాక్ ఆధిక్యంలో ఉంది. కాగా టేబుల్లో ఈ రెండు జట్ల ర్యాంకులు తారుమారైనప్పటికీ రెండింటికీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి వెళ్లడం దాదాపు అసాధ్యం.
ఇదీ చూడండి: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ వాయిదా