ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరు సంపాదించారు భారత్‌కు చెందిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఒకరికి మించి మరొకరు రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్న రోహిత్.. ఇప్పడు అగ్రస్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్‌పై సాధించిన అర్ధసెంచరీతో ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 25 హాఫ్ సెంచరీలున్నాయి. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 24 అర్ధశతకాలతో రెండో స్థానంలో నిలిచాడు. మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) 17 అర్ధశతకాలతో మూడో స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (60) అర్ధశతకంతో ఆకట్టుకోవడం వల్ల మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 163 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 45 పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు.
ఇవీ చూడండి.. రాహుల్-రోహిత్ షో.. కివీస్ లక్ష్యం 164