ETV Bharat / sports

గాయం చిన్నదే.. చివరి టీ20లో ఆడతా: కోహ్లీ - భారత్-ఇంగ్లాండ్ నాలుగో టీ20 కోహ్లీ

ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టీ20లో తొడ కండరాలు పట్టేయడం వల్ల ఇబ్బందిపడ్డాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అయితే ఆ గాయం చిన్నదేనని ఐదో మ్యాచ్​లో బరిలోకి దిగుతానని వెల్లడించాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Mar 19, 2021, 2:19 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టీ20లో తొడ కండరాలు పట్టేయడం వల్ల విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్​కు రాలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడటానికి వచ్చిన సమయంలోనూ కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అయితే తనకు అయిన గాయం చిన్నదేనని.. ఐదో టీ20లో ఆడతానని వెల్లడించాడు కోహ్లీ.

"నేను బంతి కోసం పరుగెత్తా. డైవ్ చేసి బంతిని విసిరా. ఆ సమయంలో నా పొజిషన్ సరిగా లేదు. తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపించి మైదానాన్ని వీడా. అది అంత సీరియస్ కాదు. శనివారం ముఖ్యమైన ఐదో టీ20 ఉన్నందున ఎక్కువగా ఒత్తిడికి గురి కావాలని అనుకోలేదు."

-కోహ్లీ, టీమ్ఇండియా సారథి

ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 15 ఓవర్​లో బంతిని ఒడిసిపట్టే క్రమంలో ఇబ్బందిపడ్డాడు కోహ్లీ. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. ఇతడి స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేశాడు. ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గెలిచిన టీమ్ఇండియా శనివారం జరిగే తుదిపోరుకు సిద్ధమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.