ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఆ సమయంలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫిట్‌నెస్ విషయం చర్చనీయాంశమైంది. భారత్తో జరిగిన మ్యాచ్లో ఈ ఆటగాడు ఆవలింతలు తీస్తూ కనిపించాడు. ఫలితంగా విమర్శలపాలయ్యాడు. దీనికి కారణం పాక్ ఆటగాళ్ల ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్ లోపాలు అని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవలే పాక్ కోచ్గా బాధ్యత తీసుకునన్న మిస్బా.. క్రికెటర్ల ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. బిర్యానీ, స్టీట్లకు దూరంగా ఉండాలని ఆటగాళ్లను ఆజ్ఞాపించాడట.
దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో బిర్యానీ, స్వీట్స్, ఎక్కువ నూనెలో వండిన రెడ్మీట్లకు దూరంగా ఉండాలని చెప్పాడట మిస్బా. ఎవరైన ఈ నిబంధనల్ని అతిక్రమించితే వారిపై వేటు వేసేందుకూ వెనకాడబోమని ఆదేశించాడట.
ఇటీవల పాకిస్థాన్ కోచ్, చీఫ్ సెలక్టర్ పదవుల్ని మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్కు అప్పగించింది పాక్ క్రికెట్ బోర్డు. జట్టును మళ్లీ గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు మిస్బా.
పాకిస్థాన్, శ్రీలంక మధ్య కరాచీ వేదికగా ఈనెల 27 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఆ తర్వాత అక్టోబరు 5 నుంచి లాహోర్ వేదికగా మూడు టీ20లు జరగనున్నాయి. అయితే పాక్ గడ్డపై పర్యటించేందుకు శ్రీలంక క్రికెటర్లు నిరాకరిస్తున్నారు. ఫలితంగా ఈ సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఇవీ చూడండి.. 'ధోనీ రిటైర్మెంట్ విషయాన్ని వారే తేల్చాలి'