ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళా టీ20 ప్రపంచకప్ కోసం ఆరుగురు అంపైర్లను నియమించింది ఐసీసీ. వారిలో భారతీయ అంపైర్ నితిన్ మేనన్‌కు అవకాశం కల్పించింది. మిగిలిన వారిలో లూరెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, క్లైరే పొలోసక్, స్యూ రెడ్‌ఫ్రెన్, జాక్వెలిన్ విలియమ్స్ ఉన్నారు. ఇంతకు ముందు చేసిన ప్రకటనలో భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మి ని మహిళా రిఫరీగా ఎంపిక చేశారు.
ఫిబ్రవరి 21న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్‌లో విలియమ్స్, షౌన్ జార్జ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. మహిళా అంపైర్ పర్యవేక్షణలో మ్యాచ్ జరుగుతుందని బుధవారం ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
పొలోసక్.. ఫిబ్రవరి 22న వెస్టిండీస్, థాయ్‌లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు నితిన్ మేనన్‌తో కలిసి పర్యవేక్షించనున్నారు. అయితే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్రిస్ బ్రాడ్ అనే సీనియర్‌తో పాటు, స్టీవ్ బెర్నార్డ్ రిఫరీ ప్యానెల్లో ఉంటారని ఐసీసీ తెలిపింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో మ్యాచ్ అఫీషియల్స్..
మ్యాచ్ రిఫరీలు:- స్టీవ్ బెర్నార్డ్, క్రిస్ బ్రాడ్, జీఎస్ లక్ష్మి
అంపైర్లు:- లూరెన్ అజెన్‌బాగ్, బ్రాత్‌వైట్, క్రిస్ బ్రౌన్, కిమ్ కాటన్, షౌన్ జార్జ్, నితిన్ మేనన్, క్లారీ పొలోసక్, అసన్ రాజా, స్యూ రెడ్‌ఫ్రెన్, లాంగ్టన్ ర్యూసెరీ, జాక్వెలిన్ విలియమ్స్.
ఇదీ చూడండి.. యువీ అభిప్రాయంపై భారత మాజీ క్రికెటర్ కౌంటర్