భారత క్రికెట్ జట్టులో ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచిన ఆటగాడు రిషబ్ పంత్. పలు సిరీస్‌ల్లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా చోటిచ్చినా.. సరైన ప్రదర్శన చేయలేక విఫలమయ్యాడు. అందుకే అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను కీపింగ్‌కు పరీక్షించారు. అతడి అద్భుత ఫామ్ కారణంగా తుది జట్టులో చోటు కోల్పోయాడు పంత్. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బ్యాకప్ కీపర్‌గా ఎంపికైన పంత్.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు.
వన్డే తరహాలో పంత్ ఆట...
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడో హాఫ్ సెంచరీ సాధించిన పంత్.. న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మళ్లీ సూపర్ ఫామ్ ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్థ శతకం సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌లో పరుగులు రాబట్టాలనే కసి కనిపించింది. తొలుత నెమ్మదిగా ఆడిన పంత్.. ఆ తర్వాత తనదైన శైలిలో ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు.
-
Thread: Pant goes downtown for back-to-back sixes off Sodhi. (1/2)#Pant #RishabhPant #NZX1vIND pic.twitter.com/2rO8Xv5io5
— Yash Mittal 🇮🇳 (@im_yash2307) February 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thread: Pant goes downtown for back-to-back sixes off Sodhi. (1/2)#Pant #RishabhPant #NZX1vIND pic.twitter.com/2rO8Xv5io5
— Yash Mittal 🇮🇳 (@im_yash2307) February 15, 2020Thread: Pant goes downtown for back-to-back sixes off Sodhi. (1/2)#Pant #RishabhPant #NZX1vIND pic.twitter.com/2rO8Xv5io5
— Yash Mittal 🇮🇳 (@im_yash2307) February 15, 2020
మ్యాచ్ 'డ్రా' అయింది..
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పృథ్వీ షా 39 (31 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్), మయాంక్ అగర్వాల్ 81 రిటైర్డ్ హర్ట్ (99 బంతుల్లో; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మంచి ఆరంభాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన వీరిద్దరూ.. రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పృథ్వీ షా ఔటైన తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (8) మరోసారి నిరాశపర్చాడు. ఫలితంగా తొలి టెస్టులో పృథ్వీ, మయాంక్ ఓపెనింగ్ దిగే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో సాహా (30), అశ్విన్ (16) అజేయంగా నిలిచారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ ఎలెవన్ 235 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌తో బుమ్రా మళ్లీ తన వికెట్ల వేట ప్రారంభించాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఒక వికెట్ కూడా సాధించని జస్ప్రీత్.. తాజా ప్రాక్టీస్ టెస్టులో 2 వికెట్లు సాధించాడు. షమీ 3, ఉమేశ్ 2, సైనీ 2, అశ్విన్ ఒక వికెట్ సాధించారు.