ETV Bharat / sports

కివీస్​తో ఐదో టీ20... వైట్​వాష్​పై కోహ్లీసేన గురి

author img

By

Published : Feb 2, 2020, 5:31 AM IST

Updated : Feb 28, 2020, 8:37 PM IST

న్యూజిలాండ్ గడ్డపై ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్ధమౌతోంది కోహ్లీసేన. ఐదు టీ20ల సిరీస్​లో ఇప్పటికే 4-0 ఆధిక్యంలో నిలిచింది భారత్​. ఆఖరి మ్యాచ్​లోనూ గెలిచి కివీస్​ను సొంతగడ్డపై వైట్​వాష్​ చేయాలని ఊవిళ్లూరుతోంది. బే ఓవల్​​ వేదికగా ఇరుజట్లు నేడు పోటీపడనున్నాయి.

New Zealand vs India, 5th T20I: men in blue wish to witewash the kiwis in t20 series
న్యూజిలాండ్​తో ఐదో టీ20... వైట్​వాష్​పై కోహ్లీసేన గురి

న్యూజిలాండ్​లో విజయాల మోత మోగిస్తోన్న భారత జట్టు.. నేడు బే ఓవల్​ మైదానంలో కివీస్​తో ఆఖరి టీ20 ఆడనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 4-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన... క్లీన్​స్వీప్​ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్​ జట్టు పరువు కాపాడుకునేందుకు తపిస్తోంది.

ర్యాంక్​ లక్ష్యమైతే...

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ ఇప్పటివరకు టీ20 సిరీస్‌ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్​ల సిరీస్‌ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్​లో నాలుగు​ విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్​ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్​లు గెలిస్తే.. 'మెన్​ ఇన్​ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్​లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్​.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.

పంత్​కు అవకాశం...

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. నాలుగు మ్యాచ్​లు​ గెలిచి ఊపుమీదున్న భారత జట్టు.. ఈ మ్యాచ్​లో భారీ మార్పులకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్​లో ఓపెనర్​గా బరిలోకి దిగిన సంజు శాంసన్​ ఈ మ్యాచ్​లో రోహిత్​తో కలిసి బరిలోకి దిగే అవకాశముంది. కేఎల్​ రాహుల్​ స్థానంలో పంత్​ రానున్నాడు. వాషింగ్టన్​ సుందర్, జడేజా, శార్దూల్​, మనీశ్​ పాండే తుది జట్టులో పక్కాగా ఉండనున్నారు. చాహల్​ స్థానంలో కుల్దీప్​, బుమ్రా బదులు షమీ జట్టులోకి రానున్నారు.

కివీస్​ ఆత్మవిశ్వాసానికి దెబ్బ...

టీ20 ప్రపంచకప్​ ముంగిట వరుస ఓటములు న్యూజిలాండ్​కు అవమానంగా మారాయి. బౌలింగ్‌ పరంగా ఆ జట్టులో ఇబ్బందులేమీ లేవు. పేసర్లు, స్పిన్నర్లు చక్కగా బంతులు విసురుతున్నారు. కానీ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. గత మ్యాచ్​లో ఆడని కేన్​ విలియమ్సన్​ మళ్లీ జట్టులోకి రానున్నాడు. బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్రూస్‌ ఈ మ్యాచ్​లోనూ బరిలోకి దిగే అవకాశముంది.

భారత్ జట్టు (అంచనా)...

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​శర్మ (వైస్​ కెప్టెన్​), సంజు శాంసన్​, కేఎల్​ రాహుల్​/రిషభ్​ పంత్ (కీపర్​)​, వాషింగ్టన్​ సుందర్​, రవీంద్ర జడేజా, కుల్దీప్​/చాహల్,జస్ప్రీత్​ బుమ్రా/మహ్మద్​ షమి, నవదీప్​ సైని, శార్దూల్​ ఠాకూర్​

న్యూజిలాండ్ జట్టు (అంచనా)...

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్‌ బ్రూస్‌, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ, స్కాట్​ కగ్గిలిన్​, డారెల్​ మిచెల్​/ బ్లెయర్ టిక్నర్/హమీష్ బెన్నెట్

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND.
SHOTLIST:
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND.
York - 1 February 2020
1. Various exteriors of the University of York
STORYLINE:
The UK's York University confirmed one of two people who tested positive for the deadly virus is a student at the institution.
A university official said the student was unlikely to have come in contact with anyone on campus whilst suffering the infection.
The student, as well as a family member, had been staying at an apartment-hotel in the city before they were taken to a hospital in Newcastle where they tested positive for the coronavirus.
At least 259 people have been killed from the virus in China, where it emerged earlier in January.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.