న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో.. గత మ్యాచ్‌తో కంటే భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. 63 ఓవర్లు ఆడిన భారత్ 242 పరుగులకు ఆలౌటైంది.
పృథ్వీషా అదుర్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7(11 బంతుల్లో; 1ఫోర్)ను బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కివీస్‌కు భారత్ అవకాశం ఇవ్వలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు పృథ్వీ షా 54 (64 బంతుల్లో; 8ఫోర్లు, 1సిక్సర్). కెరీర్లో తొలిసారి విదేశాల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీ షా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జేమీసన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి స్లిప్‌లో ఉన్న లేథమ్ చేతికి చిక్కాడు.
-
Prithvi Shaw departs after scoring a half-century here at the Hagley Oval. His 2nd in Tests and first away from home.
— BCCI (@BCCI) February 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/oZgPpbOsuH
">Prithvi Shaw departs after scoring a half-century here at the Hagley Oval. His 2nd in Tests and first away from home.
— BCCI (@BCCI) February 29, 2020
Live - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/oZgPpbOsuHPrithvi Shaw departs after scoring a half-century here at the Hagley Oval. His 2nd in Tests and first away from home.
— BCCI (@BCCI) February 29, 2020
Live - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/oZgPpbOsuH
కోహ్లీ, రహనే నిరాశ
80 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ (3) మరోసారి నిరాశపర్చాడు. ఆ తర్వాత రహనే 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. వీరిద్దరి పేలవ ప్రదర్శన వల్ల 113 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న పుజారా, విహారి
వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా, విహారితో కలిసి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో 118 బంతుల్లో అర్ధశతకం సాధించాడీ నయావాల్. టెస్టుల్లో అతడికి ఇది 25వ అర్ధశతకం కాగా, కివీస్ గడ్డపై తొలి హాఫ్ సెంచరీ. మరో ఎండ్‌లో ఉన్న హనుమ విహారి(55) కూడా కెరీర్లో మరో అర్ధశతకం చేసుకున్నాడు. వీరిద్దరూ రాణిస్తున్న సమయంలో.. కేవలం 4 పరుగుల వ్యవధిలోనే ఔటవడం భారత ఇన్నింగ్స్‌ను కుదేలు చేసింది. ఆ తర్వాత వచ్చిన పంత్(12), జడేజా(9) బాగా నిరాశపర్చారు. ఆఖర్లో షమి(16), బుమ్రా(10*) కాస్త బ్యాట్ ఝుళిపించడం వల్ల స్కోర్ బోర్డులో కొన్ని పరుగులు చేరాయి.
-
A solid 50-run partnership between @cheteshwar1 & @Hanumavihari 🙌🙌
— BCCI (@BCCI) February 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Keep going, gents 💪
Live - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/3ig3M7HCEk
">A solid 50-run partnership between @cheteshwar1 & @Hanumavihari 🙌🙌
— BCCI (@BCCI) February 29, 2020
Keep going, gents 💪
Live - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/3ig3M7HCEkA solid 50-run partnership between @cheteshwar1 & @Hanumavihari 🙌🙌
— BCCI (@BCCI) February 29, 2020
Keep going, gents 💪
Live - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/3ig3M7HCEk
జేమిసన్ పాంచ్ పటాకా
న్యూజిలాండ్ యువ పేసర్ జేమిసన్ కెరీర్లో తొలిసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనత సాధించాడు. కేవలం 45 రన్స్ మాత్రమే ఇచ్చి ఈ ఫీట్ అందుకున్నాడు. టిమ్ సౌథీ(2/38), బౌల్ట్(2/89),వాగ్నర్(1/29) రాణించారు.