ETV Bharat / sports

రెండో టెస్టు: కష్టాల్లో భారత్​.. టీ బ్రేక్​ వద్ద 194/5 - Hanuma Vihari half

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ కష్టాల్లో పడింది. టీ బ్రేక్​ సమయానికి 53.4 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 194 రన్స్​ చేసింది. క్రీజులో పుజారా(53) అజేయంగా ఉన్నాడు.

New Zealand vs India, 2nd Test
రెండో టెస్టు: కష్టాల్లో భారత్​.. టీ బ్రేక్​ 194/5
author img

By

Published : Feb 29, 2020, 9:43 AM IST

Updated : Mar 2, 2020, 10:41 PM IST

హాగ్లీ ఓవల్‌(క్రైస్ట్‌చర్చ్‌) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ ఇన్నింగ్స్​ నెమ్మదిగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ 7(11 బంతుల్లో; 1ఫోర్​)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా 30 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కివీస్‌కు భారత్ అవకాశం ఇవ్వలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి ఇన్నింగ్స్​ చక్కదిద్దాడు పృథ్వీ షా 54 (64 బంతుల్లో; 8ఫోర్లు, 1సిక్సర్​). కెరీర్​లో తొలిసారి విదేశాల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీ షా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జేమీసన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి స్లిప్‌లో ఉన్న లేథమ్‌ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ (3) మరోసారి నిరాశపర్చాడు. రహనే(7) ఆకట్టుకోలేకపోయాడు.

ఈ దశలో పుజారా(53*), విహారి(55)ఇన్నింగ్స్​ చక్కదిద్దారు. ఇద్దరూ చెరో అర్ధశతకాలతో రాణించారు. అయితే టీ బ్రేక్​కు ముందు వాగ్నర్​ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు విహారి. ప్రస్తుతం 53.4 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 194 రన్స్​ చేసింది.

Last Updated : Mar 2, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.