ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది న్యూజిలాండ్. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్న కివీస్‌కు షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా లాథమ్ సేనకు భారీ జరిమానా విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఆటగాళ్ల ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
"న్యూజిలాండ్ జట్టు నిర్దేశిత సమయంలో 50 ఓవర్లు వేయాల్సి ఉండగా మూడు ఓవర్లు ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్‌కు సారథిగా ఉన్న టామ్ లాథమ్ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన
ఈ సిరీస్‌లో కివీస్‌కు ఇదే మొదటి జరిమాన. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే నాలుగు, ఐదు టీ20లతో పాటు మొదటి వన్డేలో జరిమానాకు గురైంది టీమిండియా.