ETV Bharat / sports

విజ్డెన్​ ట్రోఫీకి రిటైర్మెంట్​ పలికే టైమొచ్చింది! - Ian Botham

కరోనా సంక్షోభ సమయంలోనూ ఇంగ్లాండ్​-వెస్టిండీస్​ జట్లు విజ్డెన్​ ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1-1తో సిరీస్​ సమం కాగా.. నేడు ప్రారంభమైన నిర్ణయాత్మక మ్యాచ్​లో గెలిచిన జట్టు వద్ద ట్రోఫీ ఉండనుంది. అయితే ఈ ట్రోఫీ ఈ సిరీస్​లోనే ఆఖరిసారి కనువిందు చేయనుంది.

wisden news
విజ్డెన్​ ట్రోఫీకి రిటైర్మెంట్​ పలికే టైమొచ్చింది..
author img

By

Published : Jul 24, 2020, 4:31 PM IST

Updated : Jul 24, 2020, 4:36 PM IST

ప్రతిష్ఠాత్మక విజ్డెన్​ ట్రోఫీ కోసం చివరిసారి పోటీపడుతున్నాయి ఇంగ్లాండ్​-విండీస్​ జట్లు. ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లోనే ఈ ట్రోఫీ ఆఖరిసారి కనిపించనుంది. ఈ సిరీస్​ నెగ్గిన జట్టు దగ్గరే ట్రోఫీ జీవితకాలం ఉండిపోనుంది. ఎందుకంటే ఆ తర్వాత విజ్డెన్​ ట్రోఫీకి రిటైర్మెంట్​ ప్రకటించనున్నారు. ఇరుజట్లు వచ్చే ఏడాది నుంచి రిచర్డ్స్​-బోథమ్​ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఇంగ్లాండ్​ వేల్స్​ క్రికెట్ బోర్డు, వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డులు ఓ నిర్ణయానికి వచ్చాయి.

1963లో ప్రారంభం...

విజ్డెన్​ ట్రోఫీని 1963లో ప్రవేశపెట్టారు. విజ్డెన్​ క్రికెటర్స్​ ఆల్మనక్(విజ్డెన్​)​ పుస్తకం 100వ ఎడిషన్ సందర్భంగా దీన్ని ప్రారంభించారు.​ ఆనాటి ట్రోఫీని లార్డ్స్​లోని ఎమ్​సీసీ మ్యూజియంలో ఉంచారు. అయితే 57 ఏళ్ల తర్వాత వెస్టిండీస్​-ఇంగ్లాండ్​ దిగ్గజాలు వివియన్​ రిచర్డ్స్​, ఇయాన్​ బోథమ్​ పేరిట దీని పేరు మార్చనున్నారు.

New Richards-Botham trophy for future England-West Indies Test series
విజ్డెన్​ ట్రోఫీ

"నిజంగా ఇది నాకు, నా మిత్రుడు ఇయాన్​కు గొప్ప గౌరవం. చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు పొందే క్రికెటర్​గా ఎదగడానికి కారణం నేను ఆటపై చూపిన ప్రేమని ఇప్పుడు తెలుకున్నా. ఇంగ్లాండ్​ వెళ్లి సోమర్​సెట్​ తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు నేను కలిసిన మొదటి వ్యక్తి ఇయాన్​ బోథమ్​. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. జీవితాంతం మిత్రులుగానే ఉంటాం"

-వివియన్​ రిచర్డ్స్​

తాను ఆడిన అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో రిచర్డ్స్​ ఒకరిగా పేర్కొన్నాడు బోథమ్​. అతడు మంచి స్నేహితుడు అయినప్పటికీ మైదానంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేదని అభిప్రాయపడ్డాడు. వివియన్​ను ఔట్​ చేస్తే ఓ అమూల్యమైన వికెట్​ సాధించినట్లుగా ఫీలయ్యేవాడినని చెప్పుకొచ్చాడు బోథమ్​. టెస్టుల్లో విండీస్​ జట్టుతో తలపడటం అంత సులభం ఏమీ కాదన్న ఆయన.. ఇద్దరి పేర్ల మీద ట్రోఫీ పెట్టడం ఆనందంగా ఉందన్నాడు​.

ఇయాన్​ బోథమ్​, వివియన్​ రిచర్డ్స్​

రిచర్డ్స్ 62.36 సగటుతో ఇంగ్లాండ్​పై పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. విండీస్​పై బోథమ్ 20 టెస్టులు ఆడి 61 వికెట్లు సాధించాడు. సగటు 35.18గా ఉంది.

విజ్డెన్​ ట్రోఫీ ప్రారంభమయ్యాక ఇంగ్లాండ్​-వెస్టిండీస్​ మధ్య 27 సిరీస్​లు జరిగాయి. ఇందులో 9సార్లు ఇంగ్లాండ్​ ట్రోఫీ గెలవగా.. నాలుగుసార్లు డ్రాగా ముగించింది. గతేడాది జరిగిన సిరీస్​లో గెలిచిన విండీస్ చివరిగా​ ట్రోఫీని కైవసం చేసుకుంది. నేడు ప్రారంభమయ్యే ఆఖరి టెస్టును డ్రా చేసినా.. గెలిచినా కప్పు విండీస్​ దగ్గరే ఉండనుంది. 2022లో కరీబియన్​ గడ్డపై రెండు టెస్టుల్లో తలపడనున్న ఇంగ్లాండ్​.. వాటిని రిచర్డ్స్​-బోథమ్​ ట్రోఫీలో భాగంగా ఆడనుంది.

విజ్డెన్​ ట్రోఫీతో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు

Last Updated : Jul 24, 2020, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.