ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్.. తన మానసిక ఆరోగ్యం గురించి తాజాగా వెల్లడించాడు. ఒకానొక సమయంలో ఆత్మహత్యకు పాల్పడదామన్న ఆలోచన వచ్చిందని తెలిపాడు. 2017 నుంచి మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న ఈ క్రికెటర్.. ఆస్ట్రేలియా తరఫున 11 వన్డేలు, 11 టీ20లు, నాలుగు టెస్టులు ఆడాడు.
"మానసిక ఒత్తిడికి సంబంధించి గూగుల్‌లో చూసిన లక్షణాలలో ప్రతి ఒక్కటి నాలో ఉన్నాయి. ఆ సమయంలో అనేక రకాల ఔషధాలు పరిశీలించాను. ఓ దశలో ఎవరికి కాల్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి కారులో 110 కి.మీ వేగంతో వెళ్లి పిల్లర్‌కు ఢీ కొట్టాలనిపించేది. ఆ సమయంలో సోదరులు, భార్య క్రిస్టా గుర్తొచ్చారు. వెంటనే ఆలోచన విరమించుకున్నా" అని హెన్రిక్స్ తెలిపాడు.
ఇదీ చూడండి.. 'సచిన్‌ను దూషించినందుకు బాధపడ్డా'