ETV Bharat / sports

చెన్నై ​టెస్టును హెలికాప్టర్​ నుంచి వీక్షించిన మోదీ - మోదీ ట్వీట్స్​

తమిళనాడు పర్యటన ముగించుకుని తిరిగి దిల్లీకి పయనమైన క్రమంలో భారత్​-ఇంగ్లండ్​ మ్యాచ్​ స్టేడియాన్ని చూశానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చెన్నైలో చూసిన ఈ ఆసక్తికరమైన దృశ్యాన్ని ట్విట్టర్​లో పంచుకున్నారు.

Modi catches fleeting view of interesting Ind-Eng 2nd Test
'చెన్నై టెస్ట్​ క్రికెట్​ దృశ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి'
author img

By

Published : Feb 14, 2021, 8:12 PM IST

భారత్​-ఇంగ్లండ్​ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్​ మ్యాచ్​ను హెలికాఫ్టర్​ నుంచి వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం రోజు తమిళనాడు పర్యటన అనంతరం.. దిల్లీకి పయనమైన క్రమంలో ఈ ఆసక్తికరమైన దృశ్యం తనను ఆకర్షించందన్నారాయన. సంబంధిత ఎంఏ చిదంబరం స్డేడియం దృశ్యాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

PM Modi Tweet
నరేంద్ర మోదీ ట్వీట్​

రెండో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​ను 134పరుగులకే అలౌట్​ చేసి​ మ్యాచ్​పై పట్టుబిగించింది భారత్. ఇప్పటికే 249 పరుగుల ఆధిక్యం సాధించిన టీమ్​ఇండియా.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా ప్రణాళికలు వేస్తోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్​ కోల్పోయి 54 పరుగులు చేసింది.​ రోహిత్​ శర్మ(25), పుజారా(7) క్రీజులో ఉన్నారు.

నాలుగు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడేందుకు భారత్​లో పర్యటిస్తోంది ఇంగ్లీష్​ జట్టు. చెన్నై వేదికగానే జరిగిన తొలిమ్యాచ్​లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్​లూ.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతేరా(అహ్మదాబాద్​)లో జరగనున్నాయి.

ఇదీ చదవండి:భారత్​ వైపు ప్రపంచం ఉత్సాహంగా చూస్తోంది: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.