ETV Bharat / sports

'మహిళా ఐపీఎల్​ను బీసీసీఐ వచ్చే ఏడాది ప్రారంభించాలి' - mithali news

పరిమిత స్థాయిలోనైనా మహిళా ఐపీఎల్​ను ప్రారంభించాలని అభిప్రాయపడింది భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. వచ్చే ఏడాదే ఈ టోర్నీని మొదలుపెట్టాలని బీసీసీఐని కోరింది.

'మహిళా ఐపీఎల్​ కోసం బీసీసీఐ ఎక్కువ కాలం చూడొద్దు'
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
author img

By

Published : Mar 26, 2020, 7:38 PM IST

మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ ఎక్కువకాలం ఎదురుచూడొద్దని టీమిండియా మహిళ వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. పురుషులంత కాకపోయినా పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ మొదలుపెట్టాలని కోరింది. ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడిన మిథాలీ పలు విషయాలు చెప్పింది.

'పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ఆడించాలి. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే కొన్ని నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలి. నలుగురు విదేశీ క్రికెటర్లే కాకుండా తొలి సీజన్‌లో ఐదు లేదా ఆరుగురితో ఆడించాలి' -మిథాలీ రాజ్, భారత మహిళా క్రికెటర్

పూర్తిస్థాయి ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేకపోయినా, ప్రస్తుత ఫ్రాంఛైజీలు జట్లను తీసుకుంటే ఆ సమస్యను అధిగమించొచ్చని మిథాలీ అభిప్రాయపడింది.

'దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేరనే విషయం నాకూ తెలుసు. అయితే, ఇప్పుడున్న ఫ్రాంఛైజీలు ఐదు లేదా ఆరు కొత్త జట్లను తయారు చేస్తే సరిపోతుంది. ఎలాగూ బీసీసీఐ దగ్గర నాలుగు జట్లున్నాయి. ఈ విషయంపై ఎక్కువకాలం వేచిచూడొద్దు. ఏదో ఓ సందర్భంలో ముందడుగు వేయాలి. ఏటా కొనసాగిస్తూ మెల్లమెల్లిగా నలుగురు విదేశీయుల సూత్రాన్ని అవలంబించాలి' అని వివరించింది.

అలాగే టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన యువ సంచలన బ్యాటర్‌ షెఫాలీవర్మను వన్డేల్లోనూ కొనసాగించాలని మిథాలీ పేర్కొంది. ప్రతిభకు వయసు అడ్డంకి రాకూడదని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.