ETV Bharat / sports

మిథాలీ 'డబుల్ సెంచరీ' మ్యాచ్ - mithali raj

న్యూజిలాండ్​తో మూడో వన్డేతో 200ల అంతర్జాతీయ మ్యాచ్​లు పూర్తి చేసిన మిథాలీ రాజ్​

మిథాలీ రాజ్​
author img

By

Published : Feb 1, 2019, 11:26 AM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త మైలురాయికి చేరుకుంది. ఈ వన్డేతో 200 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్​గా మిథాలీ చరిత్ర సృష్టించింది.

ఇప్పటికే మిథాలీ ఖాతాలో అత్యధిక పరుగుల రికార్డు ఉంది. తన వన్డే కెరీర్​లో 51.33 సగటుతో 6,622 పరుగులు చేసింది. అందులో ఏడు శతకాలు ఉన్నాయి.

అయితే ఈ మ్యాచ్​లో మిథాలీ పెద్దగా రాణించలేదు. 28 బంతుల్లో 9 పరుగులు చేసి వెనుదిరిగింది. మూడో వన్డేలో 149 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. రెండో వన్డేలో మాత్రం 63 పరుగులు చేసి భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించింది.

1999లో వన్డే కెరీర్​ను ప్రారంభించిన మిథాలీ... జరిగిన ఆడిన 263 మ్యాచ్​ల్లో 200 వన్డేలు ఆడటం విశేషం. వీటితో పాటు 10 టెస్టులు, 85 టీ20లు ఆడింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.