రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలో ఆన్ ఆడుతూ, మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 203 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 497/9 స్కోరు వద్ద డిక్లేర్ ఇవ్వగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు సఫారీలు. ఓవర్ నైట్ స్కోరు 9/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. ఆరంభంలోనే డుప్లెసిస్(1) వికెట్ కోల్పోయింది. అనంతరం మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు హంజా - బవుమా. వీరిద్దరూ 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధశతకం చేసి ఊపుమీదున్న హంజాను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు జడేజా. కాసేపటికే బవుమాను స్టంపౌట్‌తో వెనక్కి పంపాడు నదీమ్. భోజన విరామ సమయానికే ఆరు వికెట్లు కోల్పోయారు సఫారీలు.
ఆ తర్వాత త్వరత్వరగా మిగతా వికెట్లు చేజార్చుకుంది. 497 స్కోరులో సగం పరుగులు కూడా చేయని దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌కు ఆహ్వానించింది కోహ్లీసేన.
రెండో ఇన్నింగ్స్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు సఫారీ బ్యాట్స్‌మెన్. డికాక్ (5), జుబైర్ హమ్జా (0), డుప్లెసిస్ (4), బవుమా (0), క్లాసన్ (5), లిండే (27), పీట్ (23) రబాడ (12) విఫలమయ్యారు. ఎల్గర్ 16 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. బ్రూన్ (30), నోర్జ్జే (5) క్రీజులో ఉన్నారు. ఇంకా 203 పరుగుల ఆధిక్యంలో నిలిచింది టీమిండియా.
భారత బౌలర్లలో షమికి మూడు వికెట్లు దక్కగా.. ఉమేశ్ యాదవ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇవీ చూడండి.. గేల్‌కు మొండిచేయి.. రషీద్ ఖాన్ ఎంపిక