ETV Bharat / sports

'సచిన్.. మరెన్నో తరాలకు మీరు స్ఫూర్తిగా నిలవాలి' - sachin birthday

క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా క్రీడాకారులు, సినీతారలతో పాటు అభిమానులు మాస్టర్​కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా విషెష్ చెప్పారు.

సచిన్
సచిన్
author img

By

Published : Apr 24, 2020, 1:46 PM IST

Updated : Apr 24, 2020, 3:43 PM IST

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటికే సచిన్‌ అభిమానుల పోస్టులతో ఆయన పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే మాస్టర్​కు క్రికెటర్లతో పాటు సినీ తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సచిన్​కు బర్త్​డే విషెష్ తెలియజేశారు.

  • "క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేశం గర్వించదగ్గ ఒకే ఒక్క మాస్టర్ బ్లాస్టర్ సచిన్. మరెన్నో తరాలకు మీరు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండాలి" -చిరంజీవి
  • "ఇది నిజం. ఒక గొప్ప వ్యక్తి బ్యాటింగ్‌ చేస్తూ భారత్‌లో సమయాన్ని ఆపగలిగేవాడు. అయితే, సచిన్‌ కెరీర్‌లో అతిపెద్ద స్ఫూర్తి ఏదైనా ఉందంటే అది ఈ రెండు చిత్రాల్లోనే దాగి ఉంది. ప్రతీ కష్టం వెనుక ఓ విజయం ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని తప్పకుండా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీబర్త్‌డే సచిన్‌" -సెహ్వాగ్‌
  • "క్రికెట్‌ ఆటపై ఉన్న మక్కువతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు." -విరాట్‌ కోహ్లీ
  • "తన బ్యాటింగ్‌తో మంత్రముగ్ధుల్ని చేసిన క్రికెట్‌ లెజెండ్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీ రికార్డుల వలే మీ జీవితం కూడా మరింత మెరవాలి." -యువరాజ్‌ సింగ్‌
  • "సచిన్‌ తెందూల్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి." -సౌరభ్‌ గంగూలీ
  • "హ్యాపీబర్త్‌డే పాజీ. మీ కుటుంబంతో ఈ రోజును ఆస్వాదించండి. త్వరలోనే కలుస్తా. జాగ్రత్తగా ఉండండి. ఎంతో ప్రేమతో.." -హర్భజన్‌సింగ్‌
  • "ప్రియమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే స్ఫూర్తిప్రధాతగా నిలుస్తూనే ఉండాలి. మీరు చేసే ప్రతి పనిలో అన్నీ విజయాలే సాధించాలి." -వీవీఎస్‌ లక్ష్మణ్
  • "జన్మదిన శుభాకాంక్షలు సచిన్‌ పాజీ. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీతో కలిసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడం నేను చేసుకున్న అదృష్టం. మరీ ముఖ్యంగా నా తొలి శతకంతో పాటు మీ వందో శతకం కూడా.." -సురేశ్‌ రైనా

Last Updated : Apr 24, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.