ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్‌కు భారీ జరిమానా పడింది. బిగ్ బాష్ లీగ్‌లో సహచర ఆసీస్ ఆటగాడు కేన్ రిచర్డ్సన్ను వ్యక్తిగతంగా దూషించిన కారణంగా అతడికి 7500 డాలర్ల(రూ.5లక్షల 38వేలు) ఫైన్ విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
మెల్బోర్న్ స్టార్స్ - మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెనిగేడ్స్ ఆటగాడు రిచర్డ్సన్ను రెచ్చగొట్టేలా దూషించాడు స్టోయినిస్. అనంతరం తన తప్పు ఒప్పుకుని చేసిన పనికి క్షమాపణ చెప్పాడు.
ఆ క్షణంలో అనుకోకుండా నోరు జారా. వెంటనే నేను చేసిన తప్పు తెలుసుకుని కేన్‌కు, అంపైర్లకు క్షమాపణ కోరా. తప్పుకు ప్రతిఫలంగా ఏ శిక్ష వేసిన సమ్మతమే. విధించిన జరిమానాను అంగీకరిస్తున్నా - మార్కస్ స్టోయినిస్, ఆసీస్ క్రికెటర్
2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం ఆటగాళ్ల ప్రవర్తనపై ఓ కన్నేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. రెచ్చగొట్టేలా మాట్లాడటం, దూషించడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు విధిస్తుంది.
ఇదీ చదవండి: 'అందరికీ అరంగేట్రం.. నాకు మాత్రం ముగింపు'