ETV Bharat / sports

టాస్ గెలిస్తే టీ20 ప్రపంచకప్ గెలిచినట్లే: వాన్ - టీ20 ప్రపంచకప్ మైఖేల్ వాన్

టీమ్ఇండియాతో జరిగిన మూడో టీ20లో ఘనవిజయం సాధించింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు ఫీల్డింగ్ తీసుకుని ఛేదనను సులభంగా పూర్తి చేసింది. అయితే ఈ సిరీస్​లో ఇప్పటివరకు టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. తాజాగా ఈ విషయమై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Vaughan
వాన్
author img

By

Published : Mar 17, 2021, 1:20 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా పరాజయం చెందింది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుని ఛేదనను సులభంగా పూర్తి చేసింది. అయితే ఇప్పటివరకు ఈ సిరీస్​లో జరిగిన మూడు మ్యాచ్​ల్లోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. అదీ ఛేదన జట్టే గెలిచింది. తాజాగా ఈ విషయపై స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్. త్వరలో భారత్​లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"చూస్తుంటే భారత్​లో జరగబోయే టీ20 ప్రపంచకప్​లో ఉత్తమ టాసర్ (టాస్ గెలిచే జట్టు) విజేతగా నిలిచేలా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు వాన్.

ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్​ల్లో టాస్ కీలకపాత్ర పోషించింది. మొదటి, మూడో మ్యాచ్​ల్లో ఇంగ్లాండ్ టాస్ గెలవగా, రెండో మ్యాచ్​లో భారత్​ను టాస్ వరించింది. ఈ మూడు మ్యాచ్​ల్లోనూ టాస్ గెలిచిన కెప్టెన్​ ఫీల్డింగ్ తీసుకోవడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.