ETV Bharat / sports

భారత పర్యటనకు ఇంగ్లాండ్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

author img

By

Published : Jan 22, 2021, 5:59 PM IST

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్​ సిరీస్​కు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఫిబ్రవరి 5న జరిగే తొలి టెస్టుతో పర్యటన ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పర్యటన పూర్తి షెడ్యూల్​పై ఓ లుక్కేద్దాం.

IND vs ENG series
భారత్-ఇంగ్లాండ్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకుని పర్యటనను దిగ్విజయంగా ముగించింది టీమ్ఇండియా. ప్రస్తుతం స్వదేశంలో ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే సిరీస్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సిరీస్​నూ గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు కోసం శ్రమిస్తోంది. లంకతో పాటు భారత్​పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న భారత్-ఇంగ్లాండ్ సిరీస్​ల పూర్తి షెడ్యూల్, జట్ల గురించి తెలుసుకుందాం.

Look At the full shedule of IND vs ENG series
భారత్-ఇంగ్లాండ్ షెడ్యూల్

భారత​ పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ ముందున్న నేపథ్యంలో ఇరుజట్లు ఫొట్టి ఫార్మాట్​లో ఐదు మ్యాచ్​లు ఆడనున్నాయి. ఈ ఐదు టీ20లు అహ్మదాబాద్​లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్నాయి. మార్చి 12న తొలి టీ20 జరగనుండగా 20న చివరి మ్యాచ్​ ఆడనున్నాయి.

ఆ తర్వాత మూడో వన్డేల సిరీస్ కోసం చెన్నై బయల్దేరనున్నాయి ఇరుజట్లు. మార్చి 23న ప్రారంభం కానున్న 50 ఓవర్ల ఫార్మాట్ తొలి మ్యాచ్​తో పాటు మిగిలిన రెండు వన్డేలను పుణెలోనే ఆడనున్నాయి. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

మొదటి రెండు టెస్టులకు జట్లు

జట్లు

ఇంగ్లాండ్

జో రూట్​(కెప్టెన్​), రోరీ బర్న్స్, డామ్​ సిబ్లీ, జోఫ్రా ఆర్చర్​, జాస్​ బట్లర్​, బెన్​ స్టోక్స్​, మొయిన్​ అలీ, జాక్​ క్రాలే, ఒల్లీ స్టోన్​, జేమ్స్​ అండర్సన్​, బెన్​ స్టోక్స్​, క్రిస్​ వోక్స్, డామ్ బెస్, డాన్ లారెన్స్, స్టువర్ట్ బ్రాడ్​, జాక్​ లీచ్.

రిజర్వు ఆటగాళ్లు: జేమ్స్ బ్రాసీ, మాసోన్ క్రేన్​, సకీబ్​ మహమూద్​, మ్యాట్ పార్కిన్సన్​, ఒల్లీ రాబిన్సన్​, అమర్​ విర్ది

భారత్

రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కోహ్లీ(కెప్టెన్), పుజారా, రహానె, పంత్, సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, సిరాజ్, శార్దుల్ ఠాకుర్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్

ఇవీ చూడండి: ఐపీఎల్2021: ఈ స్టార్ ఆటగాళ్లకు భారీ ధర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.