ETV Bharat / sports

'రోహిత్​కు టీ20 పగ్గాలు అప్పగించండి' - రోహిత్ శర్మ అతుల్ వాసన్ న్యూస్

టీమ్​ఇండియా టీ20 జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్​గా నియమించాలని సూచించాడు మాజీ క్రికెటర్ అతుల్ వాసన్. అపుడు కోహ్లీపై కాస్త భారం తగ్గుతుందని తెలిపాడు.

రోహిత్
రోహిత్
author img

By

Published : May 24, 2020, 2:32 PM IST

టీమ్​ఇండియా ఇప్పటికైనా ఫార్మాట్లకు తగ్గట్లు కెప్టెన్​లను నియమించాలని కోరుతున్నాడు మాజీ క్రికెటర్ అతుల్ వాసన్. టీ20 జట్టు సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించాలని సూచించాడు. అపుడు విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాడు.

"భారత్ ఇప్పటికైనా భిన్న ఫార్మాట్ కెప్టెన్సీను పాటించాలి. అపుడు కాస్త భారం తగ్గుతుంది. విరాట్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నాడని తెలుసు. కానీ రోహిత్ శర్మ కూడా తన నాయకత్వ లక్షణాలు చూపించాడు. కెప్టెన్​గా రోహిత్ రికార్డు బాగుంది. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ను అతడు ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టు జట్టుకు అద్భుతంగా నాయకత్వం వహిస్తున్నాడు . అలాగే వచ్చే ప్రపంచకప్​ వరకు వన్డేలకూ అతడే సారథిగా ఉండాలి"

-అతుల్ వాసన్, మాజీ క్రికెటర్

ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్​గా ఉన్నాడు. రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్​గా కొనసాగుతున్నాడు. కోహ్లీ గైర్హాజరుతో కొన్ని సిరీస్​లకు కెప్టెన్​గా వ్యవహరించిన రోహిత్ మంచి ఫలితాలు రాబట్టాడు. ఫలితంగా కనీసం టీ20 జట్టుకైనా హిట్​మ్యాన్​ను కెప్టెన్​గా నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.