ETV Bharat / sports

'కుల్​దీప్​ లాంటి స్పిన్నర్ దొరకడం కష్టమే'

ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో స్పిన్నర్​ కుల్​దీప్ యాదవ్​కు తుదిజట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడి లాంటి ఎడమ చేతి మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని వెల్లడించాడు.

Kuldeep, Pathan
కుల్​దీప్, పఠాన్
author img

By

Published : Feb 3, 2021, 7:13 AM IST

కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. కుల్దీప్​కు రాబోయే టెస్టు సిరీస్‌లో కచ్చితంగా తుది జట్టులో చోటు దక్కుతుందని ఇర్ఫాన్ ఆశిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపికైనా కుల్‌దీప్​కు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అవకాశం వస్తే రాణిస్తాడని పఠాన్‌ పేర్కొన్నాడు.

"తుది జట్టులో అవకాశం దక్కని ఆటగాళ్ల పట్ల జట్టు యాజమాన్యం సరైన పద్ధతిలో వ్యవహరిస్తోందని నేను ఆశిస్తున్నా. వారిని మానసికంగా దృఢంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అందుకే ఇటీవల యువకులు బాగా రాణించిన సందర్భాలను మనం చూశాం. అలాగే కుల్‌దీప్‌ విషయంలోనూ జట్టు అండగా ఉందని అనుకుంటున్నా. అతడో వైవిధ్యమైన బౌలర్‌. అతడికిప్పుడు 25-26 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులోనే పరిణతి చెందుతాడు. రాబోయే సిరీస్‌లో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాణించడానికి సిద్ధంగా ఉంటాడు."

-ఇర్ఫాన్ పఠాన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్‌ గత ప్రదర్శనలు చూస్తే.. ఆ జట్టు లెగ్‌ స్పిన్నర్లపై ఆడలేదని, దాంతో కుల్‌దీప్‌ ఈ సిరీస్‌లో ఆడినప్పుడు కచ్చితంగా మంచి ప్రదర్శన చేస్తాడని చెప్పాడు. అలాగే టీమ్‌ఇండియా ఎలాంటి కాంబినేషన్‌లోనైనా ఆడగలదని పఠాన్‌ అన్నాడు. చెన్నై పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ముగ్గుర్ని కూడా ఆడించొచ్చని పేర్కొన్నాడు. సహజంగా భారత జట్టు ముగ్గురు పేసర్లతో ఏ వికెట్‌ మీదైనా ఆడుతుందని తెలిపాడు. అయితే అక్కడి పిచ్‌ను పరిశీలిస్తే ముగ్గురు స్పిన్నర్లు అవసరమని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.