ETV Bharat / sports

లంక ప్రీమియర్ లీగ్ మరోసారి వాయిదా! - నవంబరు 21 నుంచి లంక ప్రీమియర్ లీగ్​

నవంబరు 21 నుంచి లంక ప్రీమియర్ లీగ్​ నిర్వహించాలనే శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదనకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించలేదు. బుధవారం నుంచి ఆటగాళ్లను బయో-బబుల్​లోకి ఆహ్వానించాల్సి ఉండగా.. నేటికీ టోర్నీ నిర్వహణపై స్పష్టత రాకపోవడం బోర్డు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది..

Lanka Premier League could be postponed amid pandemic: SLC
'ఎల్​పీఎల్​ నిర్వహణపై ఆరోగ్య శాఖ అనుమతివ్వలేదు'
author img

By

Published : Nov 2, 2020, 8:23 PM IST

లంక ప్రీమియర్​ లీగ్​ నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి తగిన అనుమతి లభించలేదని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబరు 4 నుంచి ఆటగాళ్లకు 14 రోజుల నిర్బంధానికి ఏర్పాట్లు చేయాల్సిన క్రమంలో టోర్నీ నిర్వహణపై ఇప్పటికి స్పష్టత రాకపోవడంపై బోర్డు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

"లంక ప్రీమియర్​ లీగ్​ నిర్వహణ గురించి ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే ఆరోగ్య శాఖ అధికారులు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. తగిన అనుమతులు రాకుంటే టోర్నీని మరోసారి వాయిదా వేయాల్సి ఉంటుంది. దీని వల్ల అదనపు ఖర్చుతో పాటు ఆటగాళ్ల లభ్యత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అనుమతి కోసం ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులతో అనేక సార్లు చర్చలు జరిపాం. మ్యాచ్​లు హంబంటోటా, పల్లెకెలెలో మాత్రమే జరుగుతాయి. అక్కడ ఏర్పాటు చేసే బయో-బబుల్​లో ఆటగాళ్లను చేరుస్తాం. ఐపీఎల్​లో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లు అక్కడి నుంచి సరాసరి ఇక్కడికి వస్తున్నారు. టోర్నీ నిర్వహణపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోరాం. ఆ అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నాం."

- మోహన్​ డీ సిల్వా, శ్రీలంక క్రికెట్​ బోర్డు కార్యదర్శి

ఈ లీగులో కాండీ టస్కర్స్​ జట్టుకు ఆడటం కోసం భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్ పఠాన్​ తాజాగా సంతకం చేశాడు. స్టార్​ ఆటగాళ్లైన క్రిస్​ గేల్​, డారెన్​ సామి, బ్రావో, షాహిద్​ అఫ్రిది, షకిబ్ అల్​ హసన్​లు ఇందులో భాగం కానున్నారు. 5 జట్లు పాల్గొనే ఈ టోర్నీని నవంబరు 21 నుంచి డిసెంబరు 15 వరకు నిర్వహించడానికి లంక బోర్డు సన్నాహాలు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.