ETV Bharat / sports

'అందుకే చాహల్​తో మంచి అనుబంధం ఉంది' - అందుకే చాహల్​తో మంచి అనుబంధం ఉంది: కుల్దీప్

స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​తో ఉన్న అనుబంధం గురించి తాజాగా గుర్తుచేసుకున్నాడు టీమ్​ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. జీవితంతో పాటు అనేక విషయాలపై తనకు చాహల్ సూచనలు చేస్తాడని చెప్పాడు.

కుల్దీప్
కుల్దీప్
author img

By

Published : Jun 14, 2020, 8:09 PM IST

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను తొలిసారి కలిసినప్పుడు తనకు చాలా గౌరవమిచ్చాడని మణికట్టు స్పెషలిస్టు కుల్దీప్‌ యాదవ్‌ తెలిపాడు. తాజాగా వాళ్లిద్దరూ 'సలాం క్రికెట్‌' కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలపై ముచ్చటించారు.

"నేను ముంబయి ఇండియన్స్‌కు ఎంపికైనప్పుడు తొలిసారి చాహల్‌ను కలిశా. డీవై పాటిల్‌ స్టేడియంలో సాధన చేయడానికి వెళ్లినప్పుడు అతడు అక్కడే ఆడుతున్నాడు. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ వద్ద ఎదురయ్యాం. అప్పుడే నాకెంతో గౌరవమిచ్చాడు. అక్కడి నుంచే మా స్నేహం కొనసాగింది. నన్ను సొంత సోదరుడిలా భావిస్తాడు. ఎంతో బాగా చూసుకుంటాడు. జీవితంతో పాటు క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలపై సూచనలు చేస్తాడు. నాకెప్పుడైనా సమస్యలుంటే దగ్గరకొచ్చి మాట్లాడతాడు. అందువల్లే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది."

-కుల్దీప్ యాదవ్, టీమ్​ఇండియా క్రికెటర్

లాక్‌డౌన్‌ వేళ తాను కొన్ని పెయింటింగ్స్‌ వేశానని చెప్పాడు కుల్దీప్. అందులో శ్రీకృష్ణుడు చిత్రంతో పాటు కరోనా పరిస్థితుల్లో మాస్క్‌ ధరించిన వ్యక్తిది కూడా ఉందని తెలిపాడు. లాక్‌డౌన్‌ వేళ చాహల్‌ మాత్రం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాడు. నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఎవరైనా క్రికెటర్లు లైవ్‌చాట్లు నిర్వహిస్తుంటే వారి మధ్య దూరి కామెంట్లతో అలరిస్తున్నాడు. ఇక మొదట్లో తన టిక్‌టాక్‌ వీడియోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.